Wednesday, August 5, 2026 12:52 PM
Wednesday, August 5, 2026 12:52 PM

గోదారమ్మకు మూడవ సారి చంద్రబాబు పుష్కర హారతి..!

ముఖ్యమంత్రి హోదాలో మూడవ సారి గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు సిద్దమవుతోన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. తాజాగా ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్ విజయానంద్ రెడ్డి, మంత్రులు రామనారాయణరెడ్డి, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు ఉండాలంటూ చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

Also Read : చెవిరెడ్డి : విజయవాడ టూ తీహార్.. వయా మంతెన ఆశ్రమం..!

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాల నిర్వహించనుంది ఏపీ సర్కార్. 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న సర్కార్.. ఆ సమయానికి గోదావరిలో వరద ప్రవాహం ఉన్నప్పటికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనుంది. 6 జిల్లాల్లో 373 ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రిలో మోడల్ ఘాట్ ఏర్పాటు చేస్తారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోంస్టేల ఏర్పాటు చేస్తారు. ప్రమాదాలు జరగకుండా పటిష్ట కార్యాచరణ ఉండాలని సిఎం ఈ సందర్భంగా ఆదేశించారు.

Also Read : మరోసారి బయటపడిన జగన్ డబుల్ డైలాగ్..!

రద్దీ క్రమబద్ధీకరణకు ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్‌ ఉండాలని సూచించారు. గోదావరి పుష్కరాలపై సమీక్షకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వచనం అందించారు. గోదావరి నది ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఆరు జిల్లాల్లో 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయనుంది సర్కార్. తన హయాంలో 3వ సారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేసారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు చంద్రబాబు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్