Thursday, May 7, 2026 07:00 AM
Thursday, May 7, 2026 07:00 AM

బ్రేకింగ్: కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సిట్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి.. ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. ఈ కేసు ఇక ముందుకు వెళ్లే అవకాశం లేదని ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి సుదీర్ఘంగా విచారించింది దర్యాప్తు బృందం. దాదాపుగా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. నిన్న హరీష్ రావును దాదాపు ఏడు గంటల పాటు అధికారులు విచారించారు. 2014 నుంచి 2023 వరకు పెద్ద ఎత్తున సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరి ఫోన్లను విన్నారు అనేది ప్రధాన ఆరోపణ.

Also Read : అమరావతిపై కేంద్ర కేబినెట్ కీలక అడుగులు..!

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పట్లో ప్రభుత్వ పెద్దలు.. ఈ కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వారు. ఇక బిజెపి నేతలు కూడా ఈ వ్యవహారంలో బాధితులే అనేది కామెంట్. ఈ తరుణంలో తాజాగా మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు రావాలి అంటూ ఈ కేసును విచారిస్తున్న దర్యాప్తు బృందం నోటీసులు పంపింది. నంది నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని స్పష్టం చేశారు.

Also Read : విజయసాయి రెడ్డి తర్వాత అన్నకే ఈడీ ఆహ్వానం..?

ఈ అంశానికి సంబంధించి ప్రభాకరరావును ఇప్పటికే సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. పక్క ఆధారాలతోనే హరీష్ రావు, కేటీఆర్ ను విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ విచారణ తర్వాత మరో కీలక వ్యక్తికి కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. సినీ ప్రముఖులను కూడా విచారణకు పిలవవచ్చు అనే వార్తలు సైతం వినపడుతున్నాయి. ఇప్పటికే తీన్మార్ మల్లన్న, కేంద్రమంత్రి బండి సంజయ్ సహా పలువురుని విచారించారు. ఏపీ రాజకీయ నాయకుల ఫోన్లను కూడా టాపింగ్ చేశారు అనే ఆరోపణల నేపథ్యంలో.. వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. రాబోయే వారం పది రోజుల్లో ఈ కేసు కీలక పరిణామాలకు వేదిక కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్