Wednesday, May 20, 2026 01:47 AM
Wednesday, May 20, 2026 01:47 AM

పవన్ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందా..?

2014 లో పార్టీ పెట్టినా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా లేదనే ఆవేదన సగటు జనసేన కార్యకర్తది. 2024 లో అధికారంలోకి వచ్చినా సరే.. 21 స్థానాలకు మాత్రమే తాము పరిమితం అయ్యామనే ఆవేదన ఆ పార్టీ క్యాడర్ లో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. అందుకే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తమ బలం ఆధారంగా బరిలోకి దిగిన పవన్.. 2029 ఎన్నికల నాటికి బలంగా ముందుకు వెళ్లాలని, అప్పటి బలం ఆధారంగా సీట్లు డిమాండ్ చేయాలనీ భావిస్తున్నారు పవన్.

Also Read : ఆ జిల్లా నేతలపై చంద్రబాబు గుర్రు..!

అందుకే తమ పార్టీకి బలంగా ఉన్న.. గోదావరి జిల్లాల నుంచే అడుగులు వేయాలని పవన్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని కంటే ముందు ఎమ్మెల్యేలతో వరుసగా పవన్ భేటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల కోసం పిఠాపురం వెళ్ళిన పవన్.. అక్కడి నాయకులతో పాటుగా కార్యకర్తలకు కూడా సున్నిత హెచ్చరికలు పంపారు. కూటమిలో విభేదాలు సృష్టించే వారికి బహిరంగ వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్. దీనితో ఇప్పుడు ఎమ్మెల్యేలు పరుగులు పెడుతున్నారు. ఇప్పటి వరకు అటు ఇటుగా ఉన్న నాయకులు పార్టీ కోసం పని చేయడం మొదలెట్టారు.

Also Read : స్టార్ సినిమా పేరుతో అసభ్యతా? ‘టాక్సిక్’ టీజర్‌పై పబ్లిక్ ఫైర్

కార్యకర్తలను కలవడం, ప్రజల్లోకి వెళ్ళడం, కూటమి నాయకులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. టీడీపీ నాయకులతో ఉన్న విభేదాలు పక్కన పెట్టి.. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు.. అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులను, అధికారులను కలవడం మొదలుపెట్టారు. క్షేత్ర స్థాయిలో తాము ఏం చేయాలో ఒక దిశా నిర్దేశం చేసుకుని అడుగులు వేస్తున్నారు. సీట్లు పెరిగితే కనీసం 45 స్థానాల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్