Wednesday, May 20, 2026 01:49 AM
Wednesday, May 20, 2026 01:49 AM

జలరగడపై జగన్ గ్యాంగ్ మౌనం ఎందుకు..?

రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల మాజీ సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, తెలంగాణా అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు తీవ్ర చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, నల్లమల సాగర్ వ్యవహారం అన్నీ కూడా సంచలనంగా మారాయి. దీనిపై అటు సుప్రీం కోర్ట్ లో పిటీషన్ లు దాఖలు అయ్యాయి. ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా కొంత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. సున్నితంగా సిఎం చంద్రబాబు సైతం స్పందించారు.

Also Read : ఆ జిల్లా నేతలపై చంద్రబాబు గుర్రు..!

దీనిపై టీడీపీ సోషల్ మీడియా వాస్తవాలను సైతం బయటపెడుతోంది. కానీ ఈ అంశంలో వైసీపీ గాని, మాజీ సిఎం జగన్ గానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై మాత్రమే విమర్శలు చేసిన జగన్, జల వివాదంపై మాత్రం వ్యాఖ్యలు చేయలేదు. మాజీ జలవనరుల శాఖా మంత్రులు అంబటి రాంబాబు, అనీల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీని గురించి వివాదం నడుస్తూనే ఉన్నప్పటికీ.. వైసీపీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

Also Read : అమ్మో పవన్.. అధికారులలో గుండె దడ..!

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను కేవలం ప్రచారం కోసం అప్పట్లో ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కేంద్రం, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల పేరుతో.. పనులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. దీనిపై టీడీపీ విమర్శలు చేసినా సరే స్పందించకుండా.. విషయం మొత్తాన్ని అమరావతి, భోగాపురం వైపు మళ్ళించింది వైసీపీ. వైసీపీ సోషల్ మీడియా సైతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వ్యాఖ్యలు చేయడానికి వెనకాడింది. ఈ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్