Wednesday, May 6, 2026 11:48 PM
Wednesday, May 6, 2026 11:48 PM

వెనక్కు తగ్గని వైఎస్ సునీత..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పటి వరకు తీర్పు రాకపోవడం, విచారణ కొనసాగుతూనే ఉండటం మనం చూస్తున్నాం. ఆరేళ్ళ నుంచి ఈ కేసు ఇప్పటి వరకు స్పష్టత రాని పరిస్థితి. చేసింది ఎవరు.. చేయించింది ఎవరు, కాపాడుతుంది ఎవరు అనేది స్పష్టత ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నప్పటికీ.. కేసు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. సిబిఐ కి కేసు అప్పగించినా సరే.. ముందుకు అడుగులు పడటం లేదు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి, జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది.

Also Read : దూరమవుతోన్న అనుచరులు.. వైసీపీ నాయకుల్లో కొత్త భయం..!

అయితే ఈ విషయంలో వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత మాత్రం పోరాటం ఆపడం లేదు. తాజాగా మరోసారి ఆమె సుప్రీం కోర్ట్ గడప తొక్కారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు అంశంపై సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్‌ దాఖలు చేసారు సునీత. పాక్షికంగానే అనుమతిస్తూ ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్‌ చేసారు. సునీత అప్లికేషన్‌ను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీం. సీబీఐ విచారణ కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని గతంలో హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు జస్టిస్‌ సుందరేశ్‌ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

Also Read : పది నిమిషాల్లో డెలివరీ క్యాన్సిల్.. కేంద్రం వార్నింగ్..!

మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ట్రయల్‌ కోర్టు విచారణ జరిపింది. కేవలం ఇద్దరి పాత్రపైనే విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టు పాక్షిక ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై స్పందించిన సునీత.. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా ట్రయల్‌ కోర్టు పాక్షిక విచారణకు ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. ధర్మాసనం మార్గదర్శకాలనూ పట్టించుకోకుండా ఆదేశాలిచ్చినట్లు అప్లికేషన్‌లో సునీత ప్రస్తావించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్