Saturday, September 19, 2026 07:41 AM
Saturday, September 19, 2026 07:41 AM

భారత్ తో రాజీకి ట్రంప్ అడుగులు..? టూర్ ఫిక్స్ అయిందా..?

గత ఆరు నెలలుగా భారత్ ను ఏదోక రూపంలో రెచ్చగొడుతూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు భారత్ తో రాజీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ వెనక్కు తగ్గకపోవడంతో ట్రంప్ బెదిరింపులకు దిగుతూ వస్తున్నారు. భారత్ పై భారీగా సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్దమయ్యారు అనే వార్తలు కూడా మనం చూసాం. దాదాపుగా 500 శాతం సుంకాలు పెంచేందుకు రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి.

Also Read : ఆ సీనియర్ కే టీడీపీ రాష్ట్ర పగ్గాలు..?

ఈ వార్త వచ్చిన తర్వాత కూడా భారత్ వెనక్కు తగ్గే సంకేతాలు కనపడటం లేదు. ఆయిల్ కంపెనీలు ముందు వెనకడుగు వేసినా సరే.. ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అటు గయానా నుంచి కూడా భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. వేనుజువేలా ఆయిల్ ను భారత్ కు విక్రయించాలని ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇవ్వడం లేదు. అందుకే ఇప్పుడు రాజీ మార్గానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే ఆరు లేదా 8 నెలల్లో ట్రంప్ భారత్ రానున్నారు.

Also Read : తెలంగాణలో పవన్ తో బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ..?

ఈ ఏడాది వర్షా కాలం తర్వాత ట్రంప్ భారత పర్యటనకు రావచ్చు అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. జనవరి 12న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతుండగా, అమెరికా భారతదేశాన్ని తన అత్యంత ముఖ్యమైన ప్రపంచ భాగస్వామిగా పరిగణిస్తుందని అమెరికా రాయబారి సెర్బియా గొర్ కొన్ని కామెంట్స్ చేసారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది లేదా త్వరలోనే భారత్ లో అడుగు పెడతారని, ప్రధాని మోడీ, డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ మంచి స్నేహితులు అంటూ కామెంట్ చేసారు. ఆర్థిక సంబంధాలు ముఖ్యమైనవి అయినప్పటికీ, అమెరికా, భారత భాగస్వామ్యం వాణిజ్యానికి మించి విస్తరించిందని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్