Wednesday, February 4, 2026 10:48 AM
Wednesday, February 4, 2026 10:48 AM

రవితేజ – శర్వానంద్ కెరీర్‌ను డిసైడ్ చేయబోతున్న సంక్రాంతి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకే సాధారణంగా ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది. అందుకే వారి సినిమాలకు భారీ క్రేజ్‌, బిజినెస్ ఏర్పడుతుంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగ సీజన్ వచ్చిందంటే పెద్ద హీరోలు తమ సినిమాలను అదే సమయంలో విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ఈ ఏడాది సంక్రాంతికి ప్రభాస్‌, చిరంజీవి వంటి టాప్ స్టార్లు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో పండుగ బాక్సాఫీస్ మరింత హీట్‌ ఎక్కుతోంది. అయితే స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే, ఇటీవల వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రవితేజ, శర్వానంద్‌లకు ఈ సంక్రాంతి ఎంతో కీలకంగా మారింది.

Also Read : టాలీవుడ్‌లో సంక్రాంతి భయం..!

ఇద్దరూ కొంతకాలంగా సరైన హిట్‌ను అందుకోలేకపోయిన నేపథ్యంలో, ఈ పండుగకు విడుదలవుతున్న సినిమాల ఫలితం వారి మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోతే, భవిష్యత్ ప్రాజెక్టుల ఎంపిక, బిజినెస్ పరంగా మార్పులు రావడం ఖాయం. అందుకే చెప్పాలంటే, ఈ సంక్రాంతి ఇద్దరి కెరీర్‌కు ఒక కీలకమైన టెస్ట్‌గా మారింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రవితేజ, శర్వానంద్ ఇద్దరూ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసుకురావడం. అలాగే ఈ సినిమాలపై ముందుగానే భారీ అంచనాలు లేకపోవడం కూడా వీటికి కొంత ప్లస్ అయ్యే అవకాశముంది. సాధారణంగా భారీ హైప్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఇబ్బంది పడతాయి. కానీ ఎటువంటి పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మంచి టాక్‌తో నెమ్మదిగా సక్సెస్ సాధించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

Also Read : ఆ విషయంలో సారీ చెప్పిన అనసూయ..!

అలాంటి సందర్భాల్లో యావరేజ్ టాక్ వచ్చినా ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారు. దీంతో ఈసారి రవితేజ, శర్వానంద్ ఎవరు సంక్రాంతి బరిలో సక్సెస్‌ను మూటగట్టుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇక శర్వానంద్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ కాన్సెప్ట్‌తో, ఇద్దరు మహిళల మధ్య చిక్కుకున్న ఒక వ్యక్తి జీవితాన్ని హాస్యం, భావోద్వేగాలతో చూపించనుందని సమాచారం.

మొత్తానికి, రెండు ఫ్యామిలీ సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుందా? లేక రెండూ ప్రేక్షకులను మెప్పించి విజయవంతమవుతాయా? లేదంటే ఈ సంక్రాంతి ఇద్దరికీ నిరాశనే మిగులుస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరో వారం రోజుల పాటు వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్