Sunday, March 22, 2026 09:30 AM
Sunday, March 22, 2026 09:30 AM

భారత్ కే మా సపోర్ట్.. బలూచ్ లీడర్ సెన్సేషన్..!

దశాబ్దాలుగా బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న పాకిస్తాన్ కు.. బలూచ్ ఆర్మీ ఊహించని షాక్ ఇచ్చింది. గత ఏడాది మేలో స్వాతంత్ర్యం పొందినట్టు ప్రకటించిన బలూచ్ ఆర్మీ.. తాజాగా భారత్ కు అనుకూలంగా లేఖ రాసింది. బలూచిస్థాన్‌ ప్రముఖ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్, చైనా – పాక్ ల మధ్య పెరుగుతున్న స్నేహ సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేసారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో తన సైనిక దళాలను మోహరించవచ్చన్నారు.

Also Read : బాబోయ్ సిగరెట్ రేట్లు

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ కు రాసిన బహిరంగ లేఖలో, బలూచిస్థాన్ పాకిస్తాన్ నియంత్రణలో దశాబ్దాలుగా అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో రాష్ట్ర ప్రాయోజిత హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. మీర్ బలూచి ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్.. 2026 మొదటి వారంలో “2026 బలూచిస్తాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్”ను జరుపుకుంటుందని ప్రకటించారు. దీని వలన బలూచిస్తాన్ అంతర్జాతీయంగా అన్ని దేశాలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే అవకాశం లభిస్తుంది.

Also Read : వందేభారత్ స్లీపర్ ముహుర్తం ఫిక్స్.. ఆ రూట్‌లోనే..!

జైశంకర్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో.. మీర్ బలూచి.. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ ద్వారా తీసుకున్న సాహసోపేతమైన, దృఢమైన చర్యలపై ప్రసంశలు కురిపించారు. ఈ చర్యలతో భారత్ ఆదర్శంగా నిలిచిందని.. ప్రాంతీయ భద్రత విషయంలో ఆ దేశ నిబద్దతకు ఇది నిదర్శనంగా అభివర్ణించారు. బలూచిస్తాన్ రిపబ్లిక్ ఆరు కోట్ల మంది పౌరుల తరపున, భారత్ లోని 140 కోట్ల మంది ప్రజలకు, పార్లమెంటు ఉభయ సభలకు, మీడియాకు, పౌర సమాజానికి, 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి, వాణిజ్యం, రక్షణ, భద్రత, భవిష్యత్ ఇంధన సవాళ్లు, స్నేహం, నమ్మకం, పరస్పర ప్రయోజనాలను పెంపొందించడంలో భారత్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్