Sunday, September 20, 2026 12:08 AM
Sunday, September 20, 2026 12:08 AM

దుమ్ము రేపిన జేసీ.. వామ్మో..!

జేసీ బ్రదర్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దివాకర్ ట్రావెల్స్ యజమానులుగా మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు, తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అందరికీ పరిచయమే. 2014లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఎమ్మెల్యే పదవి కంటే కూడా.. మునిసిపల్ ఛైర్మన్‌ పదవి అంటేనే తనకు ఇష్టమని బహిరంగంగానే ప్రకటించారు ప్రభాకర్ రెడ్డి. నిరంతరం తాడిపత్రి మునిసిపల్ పరిధిలో పర్యటిస్తూ.. అందరి బాగోగులు స్వయంగా తెలుసుకుంటారు ప్రభాకర్ రెడ్డి. అందుకే అందరూ ముందుగా ప్రభాకరన్న అని పిలుస్తారు కూడా.

Also Read : ఏపీ వారికి రేవంత్ సంక్రాంతి గుడ్ న్యూస్..!

2024 ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి. 2014లో వార్డు కౌన్సిలర్‌గా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి ప్రజల్లోనే ఉంటూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు ఫ్యాక్షన్ కుటుంబమనే చెడ్డ పేరు ఉన్నప్పటికీ.. దానికి దూరంగానే అస్మిత్ ఉన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అస్మిత్.. ఏకంగా 27 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ.. ఇప్పటికీ తాడిపత్రి నియోజకవర్గం ప్రజలను పేరు పేరునా పలకరిస్తూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.

Also Read : నా పేరు వాడితే.. అంతే సంగతులు..!

తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏటా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వీటిల్లో మహిళలు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయిస్తారు. ఆ ఉత్సవాల నిర్వహణపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. జేసీ కుటుంబం మాత్రం వెనుకడుగు వేయటం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జేసీ అస్మిత్ రెడ్డి.. డ్యాన్సులతో రెచ్చిపోయారు. తన కుమార్తెతో కలిసి స్టెప్పులేశారు. అభిమానుల మధ్యలో ఊపేశారు. ఈ వీడియోను తన అధికారిక ఇన్ స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే డ్యాన్స్ చూసిన వాళ్లంతా.. అస్మిత్ ఎనర్జీ మామూలుగా లేదు గా అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్