Saturday, September 19, 2026 11:19 PM
Saturday, September 19, 2026 11:19 PM

డెలివరీ బాయ్స్ బంద్ ఎందుకు..? వాళ్ళను మోసం చేస్తున్నారా..?

పది నిమిషాల్లో డెలివరి.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ కు ఓ ప్యాషన్ గా మారిపోయిన పదం. ఎవరైనా కస్టమర్ ఆర్డర్ చేస్తే క్షణాల్లో ఇచ్చేస్తాం అంటూ చెప్పుకుంటూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఆర్డర్ వేగంగా ఇచ్చేసే డెలివరీ బాయ్స్ కు ప్రోత్సాహకాలు ఇవ్వడం, వారికి ఎక్కువ ఆర్డర్ లు కేటాయించడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాలం కంటే వేగంగా పరుగులు తీయాలని తపించే నేటి సమాజానికి ఈ తరహా ప్రకటనలు, చేష్టలు పిచ్చ పిచ్చగా నచ్చేస్తూ ఉంటాయి.

Also Read : ఏపీ వారికి రేవంత్ సంక్రాంతి గుడ్ న్యూస్..!

కానీ.. వీటి వలన జరిగే ప్రమాదాలకు మాత్రం బాధ్యత వహించేందుకు స్విగ్గి, అమెజాన్, జెప్టో, బ్లింక్ ఇట్ వంటి సంస్థలు మాత్రం ముందుకు రావు. ప్రమాదాల బారిన పడే డెలివరీ బాయ్స్ కు కనీసం తాము ఉన్నామనే భరోసా ఇవ్వరు. అందుకే ఇప్పుడు డెలివరీ బాయ్స్ నిరసనకు దిగారు. దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ లను సంస్థల ముందు ఉంచేందుకు.. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ను కూడా ఇందులో కలిపారని జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : జిల్లా ఏర్పాటు సరే.. మరి వాటి సంగతి..?

10 నిమిషాల డెలివరీ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మోడల్ తమను తొందరపెట్టేలా చేస్తుందని, ఒత్తిడిని పెంచుతుందని, రోడ్లపై తమ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని, తమకు ఆర్ధిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తమ అకౌంట్స్ ను కనీసం సమాచారం లేకుండా బ్లాక్ చేయడంపై కూడా డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే తాము నష్టపోతున్నామని, ఈ విషయంలో క్లారిటీ ఉండాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి. చెల్లింపుల విధానంలో కూడా కొత్త పద్దతులు తీసుకొచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని, పాత చెల్లింపుల విధానమే ఉండాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్