Wednesday, August 5, 2026 01:29 PM
Wednesday, August 5, 2026 01:29 PM

కేటీఆర్ సైడ్ అయిపోతున్నారా..? హరీష్ ను రేవంత్ ఎందుకు గురి పెట్టారు..?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు నాయకత్వ సమస్య ఆ పార్టీ కార్యకర్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ పెద్దగా ఇబ్బంది పడని కార్యకర్తలు.. ఇటీవల కాలంలో కవిత, హరీష్ రావు మధ్య యుద్ధాలతో నలిగిపోతున్నారు. ఈ సమయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీని కేటీఆర్ ముందుండి నడిపిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో కేటీఆర్ విఫలమవుతున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.

Also Read :తమ సత్తా ఏంటో చూపించిన రోకో..!

గత ఏడాది నుంచి ఆయనకు కేసుల భయం పట్టుకుంది. ఫార్ములా ఈ రేస్, ఫోన్ టాపింగ్ సహా పలు అంశాల్లో కేటీఆర్ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హరీష్ రావు టార్గెట్ గా రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంతో కేటీఆర్ పెద్దగా లెక్కలోకి రావడం లేదు. ఇదే సమయంలో కేటీఆర్ సామర్థ్యాన్ని రేవంత్ రెడ్డి తీసి పడేస్తున్నారు. ఆయనను ఓ సాధారణ యువకుడి మాదిరిగానే గుర్తిస్తున్నారు మినహా నాయకుడిగా మాట్లాడటం లేదు. విమర్శలు చేసే విషయంలో కూడా కేటీఆర్ ను పెద్దగా ప్రస్తావించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Also Read : రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కు మైండ్ బ్లాక్

తాజాగా జరిగిన కొడంగల్ సభలో కూడా కేటీఆర్ విషయంలో కాస్త తక్కువగానే మాట్లాడారు సీఎం. ఇక హరీష్ రావు విషయంలో మాత్రం పదే పదే ప్రస్తావించడం.. హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేయడం.. సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత హరీష్ రావు కూడా మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం.. ఇవన్నీ కూడా బిఆర్ఎస్ లో కేటీఆర్ ను.. వెనక్కు నడుతున్నాయి అనే ఆవేదన కొంతవరకు వినపడుతోంది. ఈ పరిస్థితులు అర్థం కాని కేటీఆర్ ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కేటీఆర్ పూర్తిగా డల్ అయినట్లుగానే కనబడుతోంది వాతావరణం. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగితే హరీష్ రావు ఆ పార్టీలో కీలక నేతగా ఎదగడం పెద్ద విషయం కాదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్