Sunday, March 22, 2026 07:05 PM
Sunday, March 22, 2026 07:05 PM

ఈరోజు (24-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 24-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 24-12-2025

కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.

—————————————

వృషభం 24-12-2025

నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

మిధునం 24-12-2025

సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

కర్కాటకం 24-12-2025

దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

—————————————

సింహం 24-12-2025

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు.

—————————————

కన్య 24-12-2025

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

—————————————

తుల 24-12-2025

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.

—————————————

వృశ్చికం 24-12-2025

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు. నూతన ఋణప్రయత్నాలు కలిసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

ధనస్సు 24-12-2025

రాజకీయ ప్రముఖుల తో చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.

—————————————

మకరం 24-12-2025

సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

—————————————

కుంభం 24-12-2025

దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

—————————————

మీనం 24-12-2025

సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్