Wednesday, February 4, 2026 06:04 PM
Wednesday, February 4, 2026 06:04 PM

తెలంగాణాలో మరో ఎన్నికల సందడి..!

తెలంగాణాలో స్థానిక సంస్థల్లో కీలకమైన పంచాయితీ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 20న గెలిచిన సర్పంచ్ లు అందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు దశల్లో నిర్వహించిన ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో.. క్షేత్ర స్థాయిలో యుద్ద వాతావరణం నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్యనే ఈ ఎన్నికల్లో పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ డామినేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతోంది.

Also Read : అంబటీ నీకో దండం.. బాబు.. ఫైర్ అవుతున్న వైసీపీ నేతలు

సిద్ధిపేట జిల్లాలో మినహా బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా కనపడటం లేదు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ తరుణంలో మరో ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కీలకంగా భావించే.. పరిషత్ ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నారు అధికారులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో రాష్ట్రంలో నిర్వహించనున్నారు అధికారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వద్దకు ఇప్పటికే ఫైల్ కూడా పంపించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల మొదటి వారం లోపు లేదా ఈ నెల చివరిలోపు ఎన్నికలు పూర్తి అవుతాయి.

Also Read : బాలయ్యకు ఫిదా అయిపోయిన ఇండియా టుడే

సిఎం ఆమోదిస్తే మాత్రం.. 25 లోపు షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి.. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ వారం లేదా వచ్చే వారంలో భేటీ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయితీ తరహాలోనే రిజర్వేషన్ లు ఖరారు చేసారు. అటు రాజకీయ పార్టీలు పరిషత్ ఎన్నికల సీట్లు, గెలిస్తే ఇచ్చే పదవులపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్ పదవులపై సిఎం ఇప్పటికే కొన్ని హామీలు ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్