Sunday, March 22, 2026 10:10 AM
Sunday, March 22, 2026 10:10 AM

2025లో దుమ్ము రేపిన పాటలివే..!

క్యాలండర్‌లో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయే సమయం దగ్గర పడింది. మరో పది రోజుల్లో కొత్త ఏడాది ఆరంభం కానుంది. 2025 ఏడాది ఎన్నో తీపి గుర్తులు.. మరెన్నో చేదు నిజాలు. ఇక టాలీవుడ్ విషయంలో అయితే ఈ ఏడాది ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు లేకుండానే ఈ ఏడాది ముగిసిపోయింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ తమ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు. కొన్ని సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తే.. కొన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు యూ ట్యూబ్‌లో విడుదలైన పాటల్లో నెలకో పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Also Read : బాలయ్యకు ఫిదా అయిపోయిన ఇండియా టుడే

వీటిల్లో ముందుగా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి వచ్చిన గోదారి గట్టు మీద రామసిలకవే.. పాట తెగ పాపులర్ అయ్యింది. ఈ పాట థియేటర్లలో కూడా డాన్సులు వేయించింది. ఇక ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన రామ్ రాథోడ్, లిఖిత చేసిన ప్రైవేట్ ఆల్బమ్ రాను బొంబయ్‌కు రాను.. అనే పాట లక్షల్లో వ్యూస్ రాబట్టింది. ఈ పాటకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా రీల్స్ చేశారు. మార్చి నెలలో రిలీజ్ అయిన కలలెన్నో చెప్పారు.. కవితల్ని దాచారు పాట కూడా మిలియన్ వ్యూస్ రాబట్టింది. కోర్టు సినిమా హిట్‌లో ఈ పాట కూడా కీలకమని దర్శక నిర్మాతలు వెల్లడించారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఇందులోని అది దా సర్‌ప్రైజ్ పాట మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ పాటలో అసభ్యకరమైన స్టెప్స్ ఉన్నాయని చాలా మంది గగ్గొలు పెట్టినప్పటికీ.. ఇన్‌స్టాలో మాత్రం చాలా మంది ఈ స్టెప్ అనుకరించారు. మే నెలలో వచ్చిన మరో పాట “గోల్డెన్ స్పారో”. ధనుష్ హీరోగా నటించిన తమిళ్ సినిమాలోని ఈ పాట భారత్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ స్టెప్ట్స్ ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక జూన్‌లో రిలీజ్ అయిన కొయిల.. కొయి కొయిలా పాట మస్త్ పాపులర్ అయ్యింది.

జులై నెలలో జూనియర్ సినిమా నుంచి వచ్చిన వైరల్ వయ్యారి నేనే అనే పాటకు శ్రీలీల వేసిన స్టెప్స్‌ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాట వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టు నెలలో వచ్చిన మోనిక పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కూలీ సినిమా నుంచి వచ్చిన ఈ పాట కాలేజీ ఫంక్షన్‌లో, వివాహ వేడుకల్లో కూడా బాగా పాపులర్. యూ ట్యూబ్‌ను ఊపేసిన పాటల్లో మోనిక ఒకటి. ఇక సెప్టెంబర్ నెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా పండుగకు ముందు వచ్చిన ఓజీ సినిమా థియోటర్లలో ఫైర్ పుట్టించింది. ఈ సినిమాలోని పాటలు కూడా పవన్ అభిమాల్లో అంతే ఫైర్ పుట్టించాయి. అన్ని హోమ్ థియేటర్లలో ఇదే పాట మారుమోగింది. అక్టోబర్ నెలలో సోషల్ మీడియాను ఓ పాత రచ్చ చేసిందనే చెప్పాలి. కే ర్యాంప్ సినిమాలో కిరణ్ ఇంట్రడక్షన్ సమయంలో చేసిన ఇదేమిటమ్మ మాయ మాయ.. పాట.. ఓ ఊపు ఊపేసింది. రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం సినిమాలో పాట అయినప్పటికీ.. ఆ పాటకు కే ర్యాంప్‌లోనే ఎక్కువ పేరు వచ్చింది. నవంబర్ నెలలో రిలీజ్ అయిన మరో పాట మీసాల పిల్ల. మెగాస్టార్ హీరోగా వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పటికీ యూ ట్యూబ్‌లో వినిపిస్తూనే ఉంది.

Also Read : తెలంగాణాలో మరో ఎన్నికల సందడి..!

డిసెంబర్‌ నెలలో రిలీజ్ అయిన చికిరి చికిరి పాట ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి ఈ పాట రిలీజ్ చేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట స్టెప్స్‌ను విదేశాల్లో కూడా అనుకరించడం విశేషం. ఏఆర్ రహమాన్ చేసిన మ్యూజిక్, చెర్రి స్టెప్స్.. ఈ పాటను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఈ పాట ఇప్పటికే కోట్లల్లో వ్యూస్ రాబట్టింది. ఇక వీటితో పాటు అఖండ 2 నుంచి తాండవం, చాంపియన్ సినిమా నుంచి గిరా గిరా.. వంటి పాటలు కూడా ఈ ఏడాది మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. మరో పది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. ఈ పది రోజుల్లో సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల నుంచి మరో పది పాటలు సంగీత ప్రియులను అలరించనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్