శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 15-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…
మేషం 16-12-2025
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయుట మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు.
—————————————
వృషభం 16-12-2025
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.
—————————————
మిధునం 16-12-2025
వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.
—————————————
కర్కాటకం 16-12-2025
ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
—————————————
సింహం 16-12-2025
కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు.
—————————————
కన్య 16-12-2025
ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.
—————————————
తుల 16-12-2025
నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
—————————————
వృశ్చికం 16-12-2025
గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.
—————————————
ధనస్సు 16-12-2025
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికానీ పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.
—————————————
మకరం 16-12-2025
సంతానం విద్యా విషయాలలో నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
—————————————
కుంభం 16-12-2025
చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై గృహమును ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
—————————————
మీనం 16-12-2025
చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
——————————–l

