Wednesday, February 4, 2026 10:48 AM
Wednesday, February 4, 2026 10:48 AM

దువ్వాడ, దివ్వెల దంపతుల అరెస్ట్..?

దివ్వల మాధురి.. గత ఏడాదికాలంగా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను.. లేటు వయసులో ప్రేమలో పడేసిన మాధురి దూకుడు మనస్తత్వంతో ఫేమస్ అవుతూ వచ్చారు. రాజకీయాలకంటే ఎంటర్టైన్మెంట్ రంగంలోనే ఆమె ఎక్కువగా ఫేమస్ అయ్యారు అనే మాట వాస్తవం. ఆస్తి తగాదాల్లో దువ్వాడ కుటుంబంలో ఆమె పెట్టిన చిచ్చు ఇప్పటికీ సైలెంట్ గా వెలుగుతూనే ఉంది. తన భార్య వాణిని కాదని దువ్వాడ శ్రీనివాస్ దివ్వల మాధురితో నడిపిన బహిరంగ వ్యవహారంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read: అఖండ 2 మూవీ రివ్యూ : నిజంగా అఖండ తాండవమే

రాజకీయంగా కూడా వైసీపీకి ఇది కొంత ఇబ్బందికర పరిస్థితిలే తీసుకొచ్చింది. అలాంటి మాధురి ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపారు. పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో ఓ ఫాం హౌస్ లో ఆమె ఇచ్చిన పార్టీ ఇప్పుడు సంచలనం అయింది. అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పాటుగా ఇతర కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందడంతో.. రైడ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొంతమంది వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు అనే వార్త రావడంతో వైసీపీ కార్యకర్తలు షాక్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాసును జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత శ్రీనివాస్, మాధురి ఇద్దరు వైసీపీపై విమర్శలు చేశారు.

Also Read : నలుగురు మంత్రులపై సీఎం సీరియస్..?

అలాంటిది వైసిపి నేతలను పార్టీకి ఆహ్వానించడం, పార్టీలో ఎంజాయ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. పక్కా సమాచారంతో రైడ్ చేసి మాధురీ తో పాటుగా మరికొంతమందిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా అరెస్టు అయినవారిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రగ్స్ కూడా వాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశంపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరికి ఆహ్వానాలు వెళ్లాయి, ఎటువంటి పదార్థాలు పార్టీలో వాడారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్