Saturday, May 9, 2026 08:22 AM
Saturday, May 9, 2026 08:22 AM

మహిళలకు నిద్ర ఎంత కీలకమో తెలుసా..?

మన జీవితంలో నిద్ర అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. చాలా మంది నిద్రను తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకు నిద్ర అనేది అత్యంత కీలకమనే అంశాన్ని వైద్యులు, నిపుణులు పదే పదే చెప్తూ ఉంటారు. అసలు మహిళలకు సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది..? ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. తక్కువ నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, రక్తనాళాల పనితీరు అధ్వాన్నంగా మారుతుంది. ఈ క్రమంలో గుండెపోటు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read : అడ్డంగా దొరికిపోయిన జోగి బ్రదర్స్

ఇక డయాబెటిస్ ప్రమాదం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర లేకపోవడంతో గ్లూకోజ్ కంట్రోల్ చేయడం శరీరానికి కష్టంగా మారుతుంది. ఇదే సమయంలో ఇన్సులిన్ ఉత్పత్తిపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఆకలి కావడం లేదా బరువు పెరగడానికి కూడా నిద్రలేమి అనేది కీలకం. రెండు హార్మోన్లు: గ్రెలిన్ (ఆకలిని నియంత్రించేది), లెప్టిన్ ( పొట్టనిండుగా ఉండటాన్ని సూచిస్తుంది) నిద్రలేమి వలన ఈ రెండు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది.

Also Read : ముచ్చల్‌తో బ్రేకప్.. చివరికి నిజం చెప్పిన స్మృతి

కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని శరీరం కోరుకుంటుంది. రాత్రి సమయాల్లో ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది బరువు పెరగడానికి అత్యంత కీలకంగా ఉంటుంది. నిద్ర, మానసిక స్థితి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. నిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను దెబ్బతీస్తుంది. చిన్న ఒత్తిళ్లు కూడా పెద్దవిగా అనిపిస్తాయి, ప్రతికూల ఆలోచనలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మానసిక స్థితిపై ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి నిద్ర అనేది అత్యంత కీలకం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో ఇక 24...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు...

బీజేపీలోకి కొడాలి నాని.....

కొడాలి వెంకటేశ్వరరావు అంటే చాలా మందికి...

తమిళ పొలిటికల్ థ్రిల్లర్.....

తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతూ...

ఆపరేషన్ సుమతి.. టార్గెట్...

“ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి...

లోకేష్ మరో రాయల్...

ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా...

బ్రేకింగ్: టీడీపీ సంచలన...

ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

పోల్స్