Sunday, March 22, 2026 08:06 AM
Sunday, March 22, 2026 08:06 AM

నిన్న జోగి.. రేపు వల్లభనేని..? మళ్ళీ ముహూర్తం ఖరారు..?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ దిశగా మళ్ళీ అడుగులు పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారాన్ని చూసుకుని చెలరేగిపోయిన వంశీ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. భూకబ్జాలు, కిడ్నాప్ వ్యవహారాలు సహా అనేక అంశాల్లో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్ళ పాటు జైల్లో గడిపిన వంశీ.. ప్రస్తుతం నియోజకవర్గంలోనే ఉంటున్నారు.

Also Read : సార్.. నన్ను ఎప్పుడు పూర్తి చేస్తారు..?

రాజకీయంగా బలహీనంగా ఉన్న వంశీకి ఇప్పుడు వరుస షాక్ లు తగులుతున్నాయి. ప్రధాన అనుచరులు ఒక్కొక్కరిని పోలీసులు గురి పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వంశీకి అత్యంత ప్రధాన అనుచరుడు.. గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్.. కొమ్మా కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమ్మా కోట్లుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాస్త ఫేమస్ అయిన ఈయన గారికి.. వంశీ చేసిన కొన్ని కీలక వ్యవహారాల్లో హస్తం ఉంటుందనే ఆరోపణలు వినిపించాయి.

Also Read : ముచ్చల్‌తో బ్రేకప్.. చివరికి నిజం చెప్పిన స్మృతి

ఇప్పుడు వంశీ మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ కావడానికి కోట్లు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు కూడా కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ తరుణంలో సత్యవర్ధాన్ కిడ్నాప్ కేసులో ఏ2 గా ఉన్న కోట్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరో ఇద్దరు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేయగా.. ఓ అనుచరుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనితో ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వంశీని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చనే వార్తలు ప్రముఖంగా వినపడుతున్నాయి. వంశీపై ఇప్పటికే నమోదు అయి ఉన్న కొన్ని కేసుల్లో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్