Sunday, June 21, 2026 02:00 PM
Sunday, June 21, 2026 02:00 PM

కోహ్లీ పనితో షాక్ అయిన గంభీర్..!

అసలు భారత క్రికెట్ లో ఏం జరుగుతోంది..? గత ఏడాది కాలంగా ఈ ప్రశ్న లేని రోజు లేదు. అంతర్జాతీయ క్రికెట్ వర్గాల నుంచి, గల్లీ క్రికెట్ ఆడే పిల్లల వరకు ఇదే ప్రశ్న. మీడియాలో ఎప్పుడూ ఏదోక వార్త వింటూనే ఉన్నాం. టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ హడావుడి ఎక్కువైన మాట వాస్తవం. క్రమంగా పరిస్థితి జట్టులో సద్దుమణిగింది అనే ప్రచారం జరిగినప్పటికీ.. అది నిజం కాదనేది ఇటీవల అర్ధమవుతోంది. గంభీర్ విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సీరియస్ గా ఉండటంతో ఏం జరుగుతుందా అనే ఆసక్తి పెరుగుతోంది.

Also Read : బ్రేకింగ్: సీనియర్లు వర్సెస్ గంభీర్.. రాయపూర్ లో కీలక మీటింగ్

ఇటీవల మొదటి వన్డే సందర్భంగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ రాణించారు. ఆ మ్యాచ్ సందర్భంగా ఆ ఇద్దరూ గంభీర్ ను పట్టించుకోలేదు అనే కామెంట్ వినపడింది. డ్రెస్సింగ్ రూమ్ లో లైట్ తీసుకున్నారనే న్యూస్ వైరల్ అయింది. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ.. గంభీర్ కు దూరంగా వెళ్ళాడు. డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ కు గంభీర్ కు గొడవ కూడా జరిగింది అనే కామెంట్ సైతం వినపడింది. ఇక ప్రాక్టీస్ సమయంలో కూడా.. ఇద్దరూ విడిగా ప్రాక్టీస్ చేస్తున్నారని, గంభీర్ కు దూరంగా ఉంటున్నారని, ఆ సమయంలో ఇతర ఆటగాళ్లను కూడా కలవడం లేదనే మాట వినపడింది.

Also Read : షాకింగ్: ఐపిఎల్ కు స్టార్ ఆటగాడు గుడ్ బై..!

ఇక ఇప్పుడు మరో వార్త వచ్చింది. రెండో వన్డే సందర్భంగా.. వీరి మధ్య రాజీ చేసేందుకు, సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాను రాయ్‌పూర్‌కు పంపినట్లు వార్తలు వచ్చాయి. నెట్ సెషన్ సమయంలో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసిన కోహ్లీ.. సెషన్ ముగియగానే, కోహ్లీ తన రెండు బ్యాట్‌లను తన భుజాలపై వేసుకుని, ఒక్క మాట కూడా మాట్లాడకుండా గంభీర్‌ కు దూరంగా వెళ్ళిపోయాడు అని జాతీయ మీడియా వెల్లడించింది. రాబోయే విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌ కు కోహ్లీ అందుబాటులో ఉన్నాడని ఖరారు చేసిన తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని భావించినప్పటికీ.. గంభీర్ తో మాట్లాడేందుకు కోహ్లీ సిద్దంగా లేడు అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్