Wednesday, August 5, 2026 11:52 AM
Wednesday, August 5, 2026 11:52 AM

పుతిన్ ఫస్ట్ ట్రంప్ నెక్స్ట్.. రష్యాతో భారత్ కీలక ఒప్పందం..?

అమెరికా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినప్పటికీ భారత్ మాత్రం రష్యాతో స్నేహం విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్ 4-5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీతో శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్న నేపధ్యంలో ఈ రెండు దేశాల మధ్య స్నేహం ఈ వారం కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భారత్ తయారు చేస్తున్న సుదర్శన చక్ర ప్రాజెక్ట్ లో కీలక అడుగు పడే అవకాశం ఉంది.

Also Read : టెలికం కీలక నిర్ణయం.. ఇక వారికి చెక్..!

శత్రు క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వంటి దాడుల నుంచి కాపాడుతూ, అవసరమైతే ప్రతిదాడి కూడా చేయగల “షీల్డ్ + స్వోర్డ్” విధానంలో దీనిని తయారు చేస్తున్నారు. దీని కోసం రష్యా సహకారం తీసుకునే విధంగా భారత్ అడుగులు పడే సూచనలు కనపడుతున్నాయి. ఇటీవల ముగిసిన ఆపరేషన్ సిందూర్‌లో, భారత్ – రష్యా దేశాల కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. క్షిపణుల నుండి వాయు రక్షణ వ్యవస్థల వరకు, ఫైటర్ జెట్‌ ల నుండి ఎలక్ట్రానిక్ యుద్ధం వరకు, రష్యన్ టెక్నాలజీ భారత్ కు ఎంతో ఉపయోగపడింది.

Also Read : బ్రేకింగ్: సీనియర్లు వర్సెస్ గంభీర్.. రాయపూర్ లో కీలక మీటింగ్

దీనితో భవిష్యత్తులో కూడా ఈ సైనిక ఒప్పందం కొనసాగే విధంగా భారత్ అడుగులు వేసే అవకాశం కనపడుతోంది. రష్యా నుండి ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. గతంలో పాక్, చైనాతో జరిగిన యుద్దాల సమయంలో భారత్ కు రష్యా ఎంతో సహకారం అందించింది. మిగ్ విమానాలను భారత్ కు రష్యా అందించిన సంగతి తెలిసిందే. దీనితో పాటుగా ఆయిల్ నిల్వలను కొనుగోలు చేసే అంశంపై కూడా ఈ రెండు దేశాల మధ్య చర్చ జరిగే సూచనలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్