Sunday, March 22, 2026 07:44 AM
Sunday, March 22, 2026 07:44 AM

ఈషా వేదికగా.. రాజ్ సమంత వివాహం?

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు రెండోసారి పెళ్లి చేసుకున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా, సినిమా వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖ న్యూస్ పోర్టల్స్‌ కథనాల ప్రకారం, సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో చాలా తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారని పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం తమిళనాడులోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా సమంత సాంప్రదాయ ఎర్రని చీర ధరించిందని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.

Also read : ఖమ్మం జిల్లాలో టీడీపీ సంచలనం..!

గత ఏడాది నుంచి సమంత మరియు రాజ్ నిడిమోరు కలిసి పలుమార్లు కనిపించడం, వారి వ్యక్తిగత జీవితాలపై వచ్చిన ఊహాగానాలు ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇరు వర్గాలు ఇప్పటివరకు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయకపోవడంతో, ఇవన్నీ కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. ఇదే సమయంలో, రాజ్ మాజీ భార్య సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వీరి బంధం పై మరింత చర్చకు దారితీసింది. అయితే ఇప్పటి వరకు ఇద్దరూ ఒక్కసారి కూడా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే దాదాపు ప్రతి శుభకార్యాన్ని వారిద్దరూ కలిసే జరుపుకున్నట్లు ఫోటోలు పోస్ట్ చేస్తుండటం జరిగింది.

Also read : ప్రక్షాళన దిశగా వైసీపీ.. టార్గెట్ ఫిక్స్..!

ఈ పెళ్లి నిజమా? లేక రూమర్ మాత్రమేనా? అన్న విషయంపై సమంత లేదా రాజ్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. సోషల్ మీడియా అంతా ఈ వివాహ వార్తలతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, అభిమానులు మాత్రం జంట నుంచి నేరుగా వచ్చే నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేక వార్తా సంస్థలు ఈ సమాచారాన్ని ప్రచురించినప్పటికీ, అధికారికంగా ధృవీకరించేదాకా ఇవన్నీ రిపోర్టులే అన్నది స్పష్టమే

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్