Sunday, June 21, 2026 01:55 PM
Sunday, June 21, 2026 01:55 PM

సిద్దరామయ్య సేఫేనా..? బలాలు ఇవే..!

కర్ణాటక రాజకీయం సైలెంట్ గా వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి క్రమంగా పెరిగిపోతోంది. డీకే శివ కుమార్ సిఎం అవుతారనే అంశానికి సంబంధించి జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ప్రస్తుత సిఎం సిద్దరామయ్య పరిస్థితి ఏంటీ..? ఆయనకు ఉన్న బలం ఏంటీ..? ఎమ్మెల్యేలు ఏ వైపు ఉన్నారు అనే అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి సిద్దరామయ్యకు ఉన్న బలాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.

Also Read : ఇరుముడితోనే విమాన ప్రయాణం..

జనతాదళ్ లో కీలక నేతగా ఎదిగిన సిద్దరామయ్య కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యారు. మైసూరు ప్రాంతానికి చెందిన సిద్దరామయ్యకు వోక్కలిగ సామాజిక వర్గంలో కీలక నేతగా గుర్తింపు ఉంది. ఆ సామాజిక వర్గం కన్నడ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉంది. పార్టీలోని 137 మంది ఎమ్మెల్యేలలో 100 మందికి పైగా ఎమ్మెల్యేల నుండి బలమైన మద్దతు ఉన్న నేత సిద్దరామయ్య. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రిని మార్చితే అనవసరంగా సమస్యలు వస్తాయనే ఆందోళన కన్నడ కాంగ్రెస్ ముఖ్యులలో వ్యక్తమవుతోంది.

Also Read : బ్రేకింగ్: ట్రంప్ సంచలన నిర్ణయం.. వాళ్లకు సబ్సిడీ రద్దు..!

డిసెంబర్ 8న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వివాదం ముగించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయపడుతున్నారు. సిఎం మార్పు విషయంలో అధిష్టానం సానుకూలంగానే ఉన్నప్పటికీ.. అంతర్గతంగా డీకే శివకుమార్ కు ఎంత బలం ఉందనే అంచనాకు అధిష్టానం రాలేకపోతోంది. 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే డీకేకి మద్దతుగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వోక్కలిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఆయనను వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సైతం కన్నడ నాట జరుగుతోంది. దీనితో ప్రస్తుతం సిఎం సిద్దరామయ్యకు ఇబ్బంది లేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్