Wednesday, February 4, 2026 02:22 PM
Wednesday, February 4, 2026 02:22 PM

రాజా సాబ్ షూటింగ్ ఇష్యూస్.. చేతులెత్తేసిన నిర్మాత

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్ వేగం అందుకున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘రెబెల్ సాబ్’ లిరికల్ సాంగ్‌కు వచ్చిన మిశ్ర స్పందనతో సోషల్ మీడియాలో హీట్ పెరిగింది. థమన్‌పై కొంతమంది ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తుండగా, మరికొందరు మాత్రం పాటను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Also Read : జాదూ రవి.. ఆ డేటా ఏం చేశాడు..? షాక్ అవుతున్న పోలీసులు..!

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘రాజా సాబ్’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. ఐదు రోజుల షూటింగ్ పాటు, కొన్ని కీలక సన్నివేశాలను రీ–షూట్ చేయాల్సిన అవసరం ఉందని టాక్. ఇప్పటికే నిర్మాత విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ ఖర్చు చేయడంతో పాటు, రెండు సార్లు VFX పనులు మరోసారి చేయాల్సి రావడం అతడిని ఒత్తిడిలోకి నెట్టిందట. అంతేకాకుండా రీ–షూట్ చేసిన సీన్స్‌లో కూడా కొన్ని షాట్స్‌ని మళ్లీ రీ–షూట్ చేయాలని డైరెక్టర్ మారుతీ అడగడంతో నిర్మాత అసహనం చెంది, ఇకపై తాను డబ్బులు పెట్టలేనని చెప్పేశాడనే ప్రచారం జోరును సంతరించుకుంది.

Also Read : వెటరన్ స్టార్ హీరో ధర్మేంద్ర కన్నుమూత.. జీవిత విశేషాలు ఇవే

ఈ పరిణామాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా క్లైమాక్స్ దశలో ఉండగానే నిర్మాత ఎందుకు డబ్బులు పెట్టడానికి నిరాకరించాడు? అసలు ఈ నిర్ణయానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలు నెటిజెన్స్ మధ్య చర్చనీయాంశంగా మారాయి. అయితే విశ్వప్రసాద్ గతంలో వచ్చిన రూమర్లపై వెంటనే ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి ఈసారి కూడా స్పందిస్తాడా? లేక మౌనమేనా? అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్