Wednesday, February 4, 2026 12:41 PM
Wednesday, February 4, 2026 12:41 PM

ఇది భారత జట్టేనా..? ఏంటి ఈ దుస్థితి..?

ఒకప్పుడు భారత్ లో టెస్ట్ మ్యాచ్ లు ఆడాలి అంటే ఎంత బలమైన జట్టు అయినా సరే.. కంగారు పడే పరిస్థితులు ఉండేవి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లు భారత పర్యటన విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవి. బారత జట్టుతో టెస్ట్ సీరీస్ అంటేనే ముందుగానే సన్నధం అయ్యేవి. స్పిన్ బౌలింగ్ విషయంలో కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగేవి. కంకర రాళ్ల మీద ప్రాక్టీస్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు విదేశీ జట్లు భారత్ లో సీరిస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు అనే భావనకు వచ్చేశాయి. సేనా జట్లు నాణ్యమైన స్పిన్నర్లను రంగంలోకి దించుతూ భారత్ ను దెబ్బ కొడుతున్నాయి.

Also Read : జాదూ రవి.. ఆ డేటా ఏం చేశాడు..? షాక్ అవుతున్న పోలీసులు..!

గత ఏడాది న్యూజిలాండ్.. భారత్ పై మంచి విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల సీరిస్ ను పక్కా వ్యూహంతో గెలిచి.. వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత నుంచి భారత్ జట్టు టెస్ట్ క్రికెట్లో క్రమంగా ఇబ్బంది పడుతూ వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో గెలవాల్సిన మ్యాచ్ లను కూడా చేజార్చుకుంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఖచ్చితంగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించే అవకాశం ఉన్నా సరే.. అతి కష్టం మీద సీరిస్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ విషయంలో కూడా భారత్ ఇదే కష్టాలు పడుతోంది. మొన్న వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో.. వైట్ వాష్ చేసిన భారత్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో మాత్రం నానా కష్టాలు పడుతోంది.

గెలవాల్సిన మొదటి టెస్టులో ఓటమిపాలైన భారత్.. రెండవ టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి దిశగా అడుగులు వేస్తున్నట్లు పరిస్థితులు కనబడుతున్నాయి. గౌహతి వేదికగా మొదలైన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో అంచనాలకు మించి రాణించింది. టాప్ ఆర్డర్ బాట్స్ మెన్ మొదలుకొని మిడిల్ ఆర్డర్ బాట్స్ మెన్ వరకు అందరూ.. దూకుడుగా బ్యాటింగ్ చేశారు. భారత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని సౌత్ ఆఫ్రికా రాణించింది. కానీ స్వదేశీ పరిస్థితులు భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. స్పిన్ బౌలింగ్ తో పాటుగా ఫాస్ట్ బౌలింగ్ ఆడటానికి భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Also Read : Mountaineer Thammineni Bharath : పర్వతారోహణ గురించి తమ్మినేని భరత్ ప్రత్యేక ఇంటర్వ్యూ

సీనియర్ ఆటగాళ్ల నుంచి యువ ఆటగాళ్ల వరకు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ టెస్ట్ లో భారత్ ఓడిపోవడం ఖాయంగా కనబడుతోంది. బౌలింగ్ విభాగం తేలిపోవడంతో సౌత్ఆఫ్రికా స్వేచ్ఛగా ఆడుతోంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రం టెస్ట్ ఛాంపియన్ లో పాల్గొనే అర్హత కష్టతరంగా మారుతుంది. దీంతో భారత్ ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే కోచింగ్ స్టాఫ్ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా స్వదేశంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. హెడ్ కోచ్ గంభీర్ ను మార్చాలి అనే డిమాండ్లు కూడా వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్