Thursday, May 7, 2026 07:24 AM
Thursday, May 7, 2026 07:24 AM

జాదూ రవి.. ఆ డేటా ఏం చేశాడు..? షాక్ అవుతున్న పోలీసులు..!

దాదాపు దశాబ్ద కాలం పాటు ఐ బొమ్మ అనే వెబ్ సైట్ ద్వారా సినిమా పరిశ్రమకు, పోలీసులకు చుక్కలు చూపించిన.. ఇమ్మడి రవి విచారణ కొనసాగుతోంది. వందల సినిమాలను పైరసీ చేస్తూ సినిమా పరిశ్రమకు.. వేల కోట్ల నష్టం మిగిల్చిన ఇమ్మడి రవిని పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ వేగవంతం చేశారు. ఇక అతను విచారణలో ఒక్కో సంచల విషయం బయట పడుతోంది. సినిమాల పైరసీ కోసం అతను వాడిన టెక్నాలజీ చూసిన పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. గత ఐదు రోజుల నుంచి పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read : గుంటూరులో వైసీపీ భారీ అవినీతి.. కోపరేటివ్ బ్యాంక్ చరిత్రలోనే..!

విచారణకు పూర్తిగా సహకరిస్తున్న అతను.. తాజాగా మరిన్ని విషయాలను బయట పెట్టాడు. ముందు విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పిన రవి.. అసలు తన వద్ద ఏ డేటా లేదని, విదేశాల్లో ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు కొన్ని ఆధారాలను అతని ముందు ఉంచి.. క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో కొన్ని విషయాలను బయటపెట్టాడు. తన అరెస్టును తాను ముందే ఊహించానని.. ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ కొనుగోలు చేశానని వెల్లడించాడు. ఈ పైరసీలో ఎవరి పాత్ర లేదని.. కర్త కర్మ క్రియ మొత్తం తానేనని అంగీకరించాడు. వెబ్ డిజైనింగ్ లో ఉన్న నాలెడ్జ్ తో అన్ని తానే చేసినట్లు వెల్లడించాడు.

Also Read : రాశీ ఖన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్.. అభిమానితో డేటింగ్ కి రెడీనా?

ఇక విదేశాల్లో ఉన్న సర్వర్లు, ఐ బొమ్మ సిబ్బందిపై పోలీసులు గత ఆరు నెలల నుంచి ఆరా తీస్తున్నారు. మూడు నెలలుగా అతని కదలికలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కరీబియన్ దీవుల్లో అతను ఎక్కడ ఉంటున్నాడనే సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఈ విషయం రవికి తెలియడంతో ఫ్రాన్స్ వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఇక తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లలో సినిమాలు మాత్రమే ఉంచి మిగిలిన డేటా మొత్తం మాయం చేశాడు. రవి బ్యాంక్ అకౌంట్ లు, క్రెడిట్ కార్డు వివరాలుతో పాటు.. పలు సమాచారాలను సేకరించిన పోలీసులు.. బ్యాంకులకు ఇప్పటికే మెయిల్స్ పంపించారు. అయితే అతనికి విదేశాల్లో ఉన్న ఎకౌంట్లో భారీగా నగదు ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్