Sunday, March 22, 2026 10:06 AM
Sunday, March 22, 2026 10:06 AM

దుమ్ము రేపుతున్న NBK 111

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ.. వరుస సినిమాలతో దూకుడు పెంచేశారు. బాలయ్య హీరోగా నటించిన అఖండ 2 డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న అఖండ 2కు ఇప్పటికే ప్రమోషన్ పనుల్లో బాలయ్య బిజీగా ఉన్నారు. అఖండ తాండవం లిరికల్ సాంగ్‌ను ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో బాలయ్య లాంచ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 21న విశాఖలో మరో పాట వస్తుందని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇక థియేటర్లలో డిసెంబర్ 5వ తేదీ నుంచి అఖండ తాండవం ఖాయమని గ్యారంటీ ఇస్తున్నారు.

Also Read : చిక్కుల్లో జక్కన్న.. పోలీస్ కేసు నమోదు

ఓ వైపు సినిమాలు చేస్తూనే అటు రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా గడిపేస్తున్నారు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ.. ప్రతి నెలా 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ.. అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టవలసిని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. అదే సమయంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అమరావతిలో కూడా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ దంపతులు భూమి పూజ చేశారు. ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అఖండ2 షూటింగ్ పూర్తి కావడంతో.. నెల రోజుల పాటు కెమెరా, లైట్స్‌కు దూరంగా ఉన్న బాలకృష్ణ.. మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. వీరసింహారెడ్డి వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని గోపీచంద్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు #NBK111 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ నెల 26న ముహుర్తం షూటింగ్ అని ప్రకటించారు. ఈ సినిమాలో ప్రముఖ నటి నయన తార హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. నయన తార పుట్టిన రోజు సందర్భంగా #NBK111 నుంచి వీడియో రిలీజ్ చేశారు.

Also Read : మాడ్వీ హిడ్మా.. వైలేంట్ హిస్టరీ.. సిఎం అభ్యర్ధినే లేపేసిన చరిత్ర..!

ద క్వీన్ ఎంటర్స్ ద ఎంపైర్ పేరుతో నయన తార లుక్ రిలీజ్ చేశారు దర్శకులు గోపీచంద్ మలినేని. ఈ వీడియోలో నయనతార లుక్ కొత్తగా ఉంది. చివర్లో గుర్రంపై వెళుతున్న సీన్‌కు బీజీఎం ఓ రేంజ్‌లో ఉందని ఇప్పటికే అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనే పేరు తప్ప.. ఎక్కడ బాలకృష్ణ పేరు అధికారికంగా ప్రకటించలేదు. చివర్లో #NBK111 అని ప్రకటించారు. బాలకృష్ణ, నయనతార కాంబోలో ఇప్పటికే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ అందరిని అలరిస్తున్నాయి. బాలకృష్ణ – నయనతార – గోపీచంద్ మలినేని కాంబో ఏ రేంజ్‌లో ఉంటుందా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్