Wednesday, February 4, 2026 09:44 PM
Wednesday, February 4, 2026 09:44 PM

నాకే ఫోన్ చేయండి.. మాలేపాటి కుటుంబానికి లోకేష్ ఇచ్చిన హామీ ఏంటీ..? 

టీడీపీ క్యాడర్ తో పాటుగా పని చేసే నాయకులకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఇప్పుడు అధిష్టానం ఆలోచన మారినట్టే కనపడుతోంది. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలపై గత కొన్నాళ్ళుగా ఫోకస్ పెడుతూ వస్తోన్న మంత్రి నారా లోకేష్.. ఇటీవల ఎమ్మెల్యేల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఇది పార్టీని ఇబ్బంది పెట్టె అవకాశం ఉన్న నేపధ్యంలో.. క్యాడర్ లో అసంతృప్తి పెరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే కావలి నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలు ఆసక్తిగా మారాయి.

Also Read: రంగంలోకి రవిశంకర్ అయ్యన్నార్.. సతీష్ హత్యలో సంచలన విషయాలు..!

కావలి నియోజకవర్గంలో.. ఇటీవల మాలేపాటి సుబ్బానాయుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆయన మృతదేహాన్ని చూసేందుకు స్థానిక ఎమ్మెల్యే కావ్యా కృష్ణా రెడ్డి వెళ్ళలేదు. దీనిపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కావలి వెళ్లి.. ఆ కుటుంబాన్ని పరమార్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో పాటుగా, స్థానిక ఎంపీకి కూడా లోకేష్ పలు సూచనలు చేసినట్టు సమాచారం. మాలేపాటి కుటుంబం నుంచి ఏ అభ్యర్ధన వచ్చినా సరే ఎవరి అభిప్రాయం కోసమూ ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారట.

Also Read: లిక్కర్ డాన్ అనీల్ చోక్రా.. ఏపీ లిక్కర్ స్కామ్ లో అతనే మాస్టర్ మైండ్..?

అలాగే పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని ఏ ఇబ్బందులు పెట్టకుండా వారికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రజా సమస్యలను వారు తీసుకొచ్చినా సరే.. అండగా ఉండాలని ఎంపీకి, అధికారులకు లోకేష్ సూచించారట. అయితే తమకు ప్రభుత్వం నుంచి ఏ సహకారం వద్దని, ఏ సమస్యలు లేకుండా ఉండే చాలని మాలేపాటి కుటుంబం చెప్పినా.. లోకేష్ మాత్రం మీకు నేను వ్యక్తిగతంగా అండగా ఉంటానని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనితో అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కూడా ఒకింత ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్