Sunday, May 17, 2026 04:06 AM
Sunday, May 17, 2026 04:06 AM

మరో బాంబు పేల్చిన కవిత..!

గత కొంతకాలంగా భారత రాష్ట్ర సమితి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆ పార్టీ నేతలను కలవరపెడుతూ వస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఇటీవల కాలంలో పార్టీ అధిష్టానాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తన సోదరుడు కేటీఆర్ విషయంలో కూడా ఆమె ఇదే తరహాలో విమర్శలు చేయడం, ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా విమర్శలు చేయడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి కలవకుంట్ల కవిత.. హరీష్ రావుతో పాటుగా, ఈసారి కేటీఆర్ టార్గెట్ గా కూడా విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Also Read : జూబ్లిహిల్స్ లో టీడీపీ క్యాడర్ ఏం చేసింది..?

భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో మాత్రమే ఉందంటూ కవిత సంచలన కామెంట్ చేశారు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయారని.. కేటీఆర్ సోషల్ మీడియా వదిలి ప్రజల్లోకి రావాలని ఆమె సూచించారు. తమతో భారత రాష్ట్ర సమితి కేడర్ టచ్ లో ఉందన్న కవిత.. జగదీష్ రెడ్డి, మదన్, ప్రశాంత్, నిరంజన్ లకు వందల కోట్లు ఎలా వచ్చాయని కవిత ప్రశ్నించారు. వాళ్లందరూ కేటీఆర్ భజన చేస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లందరూ ఆస్తులు పెంచుకున్నారు గాని క్యాడర్ పెంచుకోలేదని విమర్శించారు కవిత.

Also Read : పెట్టుబడుల్లో ఏపీ దూకుడు.. రికార్డ్ స్థాయిలో ఒప్పందాలు..!

హరీష్ రావు, గంగుల, నవీన్ రావు కోసమే ఆర్ ఆర్ ఆర్ అలైన్మెంట్ మార్చారని మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి నేతల అరాచకాల వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని.. కెసిఆర్ ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు కవిత. హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దగ్గర సంబంధాలు ఉన్నాయని కవిత విమర్శించారు. ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తుతో ప్రశ్నార్థకం అవుతుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఆలోచిపడే నేతలను దూరం పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పవన్ అడ్డా అదేనా.....

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు...

పోల్స్