ఐబొమ్మ” దాదాపు పదేళ్ళ నుంచి సినీ పరిశ్రమను కలవరపెడుతోన్న వెబ్ సైట్. ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారో అర్ధం కాక సినీ పరిశ్రమ ప్రముఖులు, పోలీసులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక తమను టార్గెట్ చేసిన వారికి.. వార్నింగ్ లు కూడా ఇవ్వడం వంటివి చూసాం. ఓటీటీ ఫ్లాట్ ఫాంల రేంజ్ లో క్వాలిటీ మెయింటేన్ చేస్తూ.. సినిమాలు అందించడంతో ప్రేక్షకులు కూడా ఆ వెబ్ సైట్ వైపు చూసిన పరిస్థితి. ఇక ఈ మధ్య కాలంలో వారిపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు.
Also Read : రేవంత్ ను తక్కువ అంచనా వేశారా..?
థాయ్లాండ్, నెథర్లాండ్స్, యూరప్ లోని కొన్ని దేశాల్లో ఉంటూ ఆపరేట్ చేస్తున్నారని గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాలు అయిన రాజస్థాన్ సహా మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నట్టు వెల్లడి అయింది. ఈ నేపధ్యంలో నిర్వాహకుడి కోసం పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. ఎట్టకేలకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాజాగా.. ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలో అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. ప్రస్తుతం అతనిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : పరిటాల నుంచి పరకామణి వరకు.. కీలక నిందితులు మరణాలు..!
నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవి గురించి పక్కా సమాచారం అందుకున్న తర్వాత నిఘా పెట్టారు పోలీసులు. కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐ బొమ్మ’ ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ‘ఐ బొమ్మ’ వెబ్ సైట్ లో ఓటీటీ మూవీలు పైరసీ చేస్తున్న నేపధ్యంలో.. అతనిపై పలువురు ప్రముఖ నిర్మాతలు ఫిర్యాదులు చేసారు. ఎక్కడ ఉన్నాడు, ఎలా చేస్తున్నాడో అర్ధం కాక పోలీసులు కూడా కొంత జాప్యం చేసినట్టు తెలుస్తోంది. ఇక అతని ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేసారు.

