ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అన్నట్లు ఉండేది. అక్కడ మీడియా కూడా అదే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసేది. సౌత్ ఇండియా సినిమాలంటే ఫ్యాక్షన్ సినిమాలు, లేదంటే లవ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు గానే జనాలు చూసేవారు. అప్పుడప్పుడు గ్యాంగ్ స్టర్ తరహా కథలు, క్రీడలకు సంబంధించిన సినిమాలు వచ్చేవి. ఎక్కువగా వీటి డామినేషన్ నడుస్తూ ఉండేది. కానీ పదేళ్ల నుంచి సౌత్ ఇండియా సినిమా రూట్ మార్చింది. బాలీవుడ్ సోదిలో కూడా లేకుండా పోయే రేంజ్ లో సినిమాలు చేస్తోంది.
Also Read : ఎమ్మెల్యేలకు టైమ్ టేబుల్ ఫిక్స్..!
బాలీవుడ్ అగ్ర హీరోలు కూడా సౌత్ ఇండియా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసిన చాలు అనుకునే వరకు తీసుకెళ్లింది. ఇక ఇప్పుడు ఓటీటీల విషయంలో కూడా అదే జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జి 5, సోనీ సహా ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు సౌత్ ఇండియా పై ఫోకస్ పెట్టాయి. సౌత్ సినిమాలను రిలీజ్ కు ముందే కొనడానికి భారీగా ఖర్చు చేస్తున్నాయి. సీనియర్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఇదే క్రేజ్ కంటిన్యూ అవుతుంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సీక్వెల్ కోసం రెండు మూడు ఫ్లాట్ ఫామ్స్ పోటీ పడ్డాయి.
Also Read : కాశ్మీర్ లో తెలుగోడి సత్తా.. ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న ఆఫీసర్..!
కాంతారా, ఓజీ, కూలీ, గతంలో కేజిఎఫ్, ఆర్ ఆర్ ఆర్, దేవర, పుష్ప 2 సినిమాలకు భారీగా పోటీ జరిగింది. ఇప్పుడు కూడా టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలపై ఓటీటీ సంస్థలు గట్టిగా గురిపెట్టాయి. ధరల విషయంలో కూడా భారీగానే ఖర్చు చేస్తున్నాయి. చిన్న చిన్న సినిమాల విషయంలో కూడా ఇదే పోటీ కొనసాగుతోంది. మొన్నటివరకు సౌత్ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టని.. నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు టాలీవుడ్ సహా మిగిలిన భాషల్లోని సౌత్ సినిమాలపై కూడా గురి పెట్టింది. ఓజీ సినిమా కోసం ముందు నుంచే వర్కౌట్ చేసి సక్సెస్ అయింది. బాలీవుడ్ సినిమాలపై మాత్రం ఈ రేంజ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా.. రిలీజ్ కు ముందే కొనేస్తున్నారు.

