Wednesday, February 4, 2026 02:22 PM
Wednesday, February 4, 2026 02:22 PM

లైట్ తీసుకోవద్దు.. జూబ్లీహిల్స్ ఎన్నికపై రేవంత్ సీరియస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అత్యంత సీరియస్ గా పరిగణిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి గులాబీ పార్టీకి షాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ప్రచారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్లిన సీఎం.. రేపు జరగబోయే ఎన్నిక విషయంలో కూడా అదే స్థాయిలో పక్క ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నారు. డివిజన్ల వారీగా నాయకులను అప్రమత్తం చేస్తూ.. పోల్ మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read : మంచి చెడు తెలియట్లేదు.. ఎమ్మెల్యేలపై లోకేష్ ఫైర్

ఎన్నిక అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మంత్రులందరూ జూబ్లీహిల్స్ లో అందుబాటులో ఉండాలని.. డివిజన్ ఇన్చార్జిలతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని, పోలింగ్ ఏజెంట్లను పగడ్బందీగా గైడ్ చేయాలని ఆదేశించారు. పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేస్తే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని తాజాగా మంత్రుల వద్ద సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే గులాబీ పార్టీ ఖచ్చితంగా వెనక్కి తగ్గుతుందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

Also Read : జోగి దందాలు.. సంచలనం దిశగా పోలీసులు..!

ఇప్పటికే మజిలీస్ పార్టీ మద్దతు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యంగా మాస్ ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తరలించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. గులాబీ పార్టీ నేతల చర్యలపై ఓకన్నేసి ఉంచాలని సూచించారు. అక్కడ ఉన్న బిజెపి నేతలపై కూడా దృష్టి సారించాలని.. ముస్లిం సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న డివిజన్లలో ఇన్చార్జ్ లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు వివిధ జిల్లాల నుంచి వచ్చి.. నియోజకవర్గంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. వారిపై కూడా ఒక ఓ కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్