Wednesday, February 4, 2026 07:21 PM
Wednesday, February 4, 2026 07:21 PM

అమెరికా ఆశలు గల్లంతు.. ఫ్యామిలీ హెల్త్ పై ఫోకస్.. వీసాలు కష్టమే..!

వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేశారు. వ్యాధులను తీవ్రంగా పరిగణించిన ట్రంప్.. తమ ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా విదేశాలకు వెళ్లే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా టీబీ వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఆ సమస్యలు ఉన్నవారిని వారి వారి దేశాలకు అనుమతించరు. ఇక ఇప్పుడు ఈ వ్యాధుల జాబితాను అమెరికా ప్రభుత్వం పెంచింది.

Also Read : వైసీపీ నేతలతో పిల్లల్ని పంపకండి.. అనిత సంచలన కామెంట్స్

క్యాన్సర్, ఒబెసిటీ, షుగర్, ఆస్తమా వంటి వ్యాధులు ఉన్నవారికి తమ దేశంలో ఎంట్రీ లేదని క్లారిటీ ఇచ్చింది అమెరికా. వీరి కారణంగా ప్రభుత్వాలపై భారం పడుతుందని.. ట్రంప్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని అమెరికాలోకి అనుమతిస్తే.. భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అది అమెరికా ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇమిగ్రేషన్ అధికారులు దృష్టిపెట్టనున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వారిని అమెరికాకు అనుమతించరు.

Also Read : మోడీ నాకు మంచి ఫ్రెండ్.. భారత్ వెళ్తాను: ట్రంప్

దీంతో ఇప్పుడు అమెరికా వీసా రావడం అనేది మరింత కష్టంగా మారినట్లే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల పౌరులు అమెరికాలో అడుగు పెట్టేందుకు దారులన్నీ మరింత కష్టంగా మారుతున్నాయి. భారత్ లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి సంఖ్య భారీగా ఉంది. అందులో యువతకు పెద్దగా మినహాయింపు లేదు. కుటుంబ సభ్యుల్లో కూడా చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక అమెరికాలో వీసా రెన్యువల్ చేసుకునే వారిపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవసరమైతే వీసాలను రద్దు చేయడానికి కూడా ట్రంప్ సర్కారు వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. శాశ్వత సభ్యత్వం కోసం అప్లై చేసిన వారి పై దృష్టి పెట్టనుంది అక్కడి విదేశాంగ శాఖ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్