Wednesday, February 4, 2026 07:01 PM
Wednesday, February 4, 2026 07:01 PM

సీబీఐ.. అప్పుడు వద్దు.. ఇప్పుడు కావాలి..!

వైసీపీ నేతల తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా.. ఎన్నికల్లో ఓడిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఒకే విషయంలో మూడు రకాల డిమాండ్లతో వైసీపీ నేతలు ఇప్పుడు అభాసుపాలవుతున్నారు. ప్రతిపక్షంలో కావాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదని.. ఓడిన తర్వాత మళ్లీ కావాలని కోరటం వెనుక ఆంతర్యం ఏమిటో వైసీపీ నేతలే చెప్పాలనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. ఇదంతా ఒకే విషయం గురించి.. అదే కల్తీ మద్యం తయరీ కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించే. కల్తీ మద్యం తయారీ కేసు విచారణ సిట్‌కు బదులుగా సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read : బోల్డ్ డెసిషన్ తీసుకున్నా.. రాజ్ నిడమోరుతో సమంత

2014-19 మధ్య కాలంలో ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా సరే.. వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తి దాడి కేసు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సీబీఐ విచారణ జరిపించాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు కూడా ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు నాటి వైసీపీ నేతలు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆ పిటిషన్లను వైసీపీ వెనక్కి తీసుకుంది. అసలు సీబీఐ విచారణ అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇక వివేకా హత్య కేసులో విచారణ జరిపిస్తున్న సీబీఐ ఎస్పీ రాం సింగ్‌ పై వేధింపుల కేసు కూడా నమోదు చేశారు నాటి ఏపీ పోలీసులు. అదే సమయంలో వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కర్నూలు వచ్చిన సీబీఐ అధికారులను వైసీపీ నేతలే అడ్డుకున్నారు. సీబీఐ విచారణను అనుమతించేది లేదని వైసీపీ నేతలే తెగేసి చెప్పారు.

Also Read : ఎక్కడున్నా వేటాడతాం.. వైసీపీ సోషల్ మీడియాకు స్ట్రాంగ్ సిగ్నల్

కానీ అదే వైసీపీ నేతలు ఇప్పుడు మాట మార్చేశారు. ఏపీలో కల్తీ మద్యం కేసు పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణకు ఏపీ సర్కార్ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. కల్తీ మద్యం కేసులో ఇప్పటికే ఏ1 ముద్దాయి అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేశారు. అయితే జోగి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపింది. కల్తీ మద్యం తయారీ కేసులో ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ పై తమకు నమ్మకం లేదని.. సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు విడుదల చేసిన వీడియో వాంగ్మూలం ఆధారంగా తనను అరెస్టు చేయడం సరి కాదని జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేష్ పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కోణంలోనే కేసు దర్యాప్తు జరుగుతోందని పొన్నవోలు ఆరోపించారు. అయితే ఇదే పొన్నవోలు.. ఏపీ అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అసలు రాజకీయ కక్ష సాధింపు అనేది లేదంటూ అమరావతి మొదలు.. ఢిల్లీ వరకు ప్రెస్ మీట్ పెట్టారు. నాడు సీబీఐ విచారణకు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తే.. అవసరం లేదన్న పొన్నవోలు.. ఇప్పుడు మాత్రం.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం ఏమిటో అర్థం కావటం లేదనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్