Wednesday, February 4, 2026 09:21 PM
Wednesday, February 4, 2026 09:21 PM

జగన్ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటో..?

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాల తీసుకుంటున్నారు. వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో.. కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఓడిన నాటి నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లోనే ఉంటున్న జగన్.. కొద్ది రోజుల పాటు పార్టీని గాలికి వదిలేశారు. అయితే జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన పలువురు నేతలు.. సైలెంట్‌గా ఇతర పార్టీల్లోకి మారిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు

Also Read : లోకేష్ మార్క్.. ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్..?

జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీలో కీలక మార్పుల దిశగా కీలక నిర్ణయాలు చేశారు. ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాల సమన్వయ కర్తలు మొదలు.. గ్రామ కమిటీల ఏర్పాటు వకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక పార్టీ రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని కూడా జగన్ మార్చేస్తున్నారు.

ప్రస్తుతంలో వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహించారు. అప్పుడు కూడా ఆయన పార్టీ బాధ్యతలే ఎక్కువగా చూశారు. అలాగే పార్టీ సోషల్ మీడియా బాధ్యతను సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి అప్పగించారు. అయితే అత్యుత్సాహంతో వ్యవహించిన భార్గవ్.. సోషల్ మీడియాలో ప్రభుత్వ, పార్టీ భజనకు తప్పుడు పోస్టులు పెట్టారు. అలాగే ప్రతిపక్షాలకు చెందిన నేతల పైన తప్పుడు ఆరోపణలు, కుటుంబ సభ్యులపైన ఫేక్ పోస్టులు పెట్టారు. ఇది పార్టీకి కావాల్సినంత చెడ్డపేరు తీసుకువచ్చింది. పార్టీ ఓడినా కూడా సజ్జల భార్గవ్ బాధ్యతల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Also Read : కొలికపూడి కథ కంచికి చేరినట్లేనా..?

అయితే సజ్జల భార్గవ్ కారణంగానే పార్టీ పరువు పోతుందనే మాట జగన్ వరకు చేరుకుంది. దీంతో పార్టీ కమిటీల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్న జగన్.. సంక్రాంతి నుంచి తాడేపల్లిలోనే ఉంటారనేది పార్టీ నేతల మాట. పార్టీకే ఎక్కువ సమయం కేటాయిస్తారనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల బాధ్యతల విషయంలో తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

పార్టీలో కీలక మార్పులకు జగన్ కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల చాలా కీలకంగా వ్యవహరించారు. వైసీపీ ఓటమికి కారణమనే అపవాదు కూడా సజ్జల మూటగట్టుకున్నారు. చివరికి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సజ్జలపైనే పరోక్షంగా విమర్శలు చేశారు. చివరికి మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి నేతలు కూడా భజన చేసే వారి వల్లే పార్టీకి నష్టం అని.. అలాంటి వారిని పక్కన పెట్టి పార్టీకి మేలు చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే సూచన చేసారు.

ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని తప్పించారు. భార్గవ్‌కు కొత్త బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో భార్గవ్‌ రెడ్డిపై కూటమి ప్రభుత్వంలో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో భార్గవ్ అరెస్టు ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు నుంచి కాపాడేందుకు జగన్ కొత్త ప్లాన్ వేశారు. భార్గవ్‌ను సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్‌గా నియమించారు. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందనే మాట వినిపిస్తోంది. సాక్షి మీడియాలో పని చేస్తున్నారు కాబట్టి.. భార్గవ్ రెడ్డిని అరెస్టు చేస్తే.. మీడియాపై దాడి అనే కోణంలో కూటమి సర్కార్‌ను ఇరుకున పెట్టవచ్చు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : క్యాబినెట్‌ నుంచి ఆ ముగ్గురు అవుట్..!

పార్టీ వ్యవహారాల నుంచి తప్పించి సాక్షి బాధ్యతలు అప్పగించడంపై పార్టీలోనే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రక్షాళనలో భాగంగా తీసుకున్న నిర్ణయం అని కొందరు అంటుంటే.. పార్టీలో జగన్ కోర్ టీంగా ఉన్న వారి బాధ్యతల్లోనూ త్వరలో మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. భార్గవ్ పైన వచ్చిన ఆరోపణలు.. పార్టీలోని కొందరు నేతలు చేసిన ఫిర్యాదుల కారణంగా పార్టీ వ్యవహారాల నుంచి తప్పించి సాక్షి బాధ్యతలు అప్పగించారనేది ఒక వర్గం నేతల మాట. అయితే, కొందరు ఇది ప్రమోషన్ గా చెబుతుంటే… మరి కొందరు మాత్రం.. ఇది పనిష్మెంట్ అంటున్నారు. దీంతో, జగన్ నిర్ణయాల పైన పార్టీలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్