ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వీసాల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా, యూకే సహా పలు దేశాలు వీసాల జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తాజాగా కెనడా కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. వీసాల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపధ్యంలో.. కెనడా అధికారులు కొంతమంది భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన పౌరుల వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
Also Read : లిక్కర్ స్కాం లో కొత్త పేరు.. అరెస్ట్ చేస్తారా..?
టూరిస్ట్ లు గా ఆ దేశంలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్, భారత పౌరులు దేశంలో అశాంతికి కారణం అవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మేరకు అవసరమైతే అమెరికా సహకారం కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒట్టావాలో అంతర్జాతీయ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ వార్త వచ్చింది. కొత్తగా జారీ చేసే వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆగస్టులో, కెనడా పోస్ట్-సెకండరీ విద్యాసంస్థల్లో చదువుకోవడానికి వీసా అప్లై చేయగా.. 74 శాతం వీసాలను కెనడా రిజెక్ట్ చేసింది.
Also Read : గోవాలో కల్తీ మద్యం.. అద్దేపల్లి లిక్కర్ దందా..!
ఇమ్మిగ్రేషన్ సంబంధిత కార్యాలయ అధికారులు వారి దేశంలో ఉన్న ఇతర దేశాల పౌరులపై గురి పెట్టినట్టు తెలుస్తోంది. కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా, కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ వీసాలను రద్దు చేసేందుకు.. గ్రూపులను కూడా ఏర్పాటు చేసినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ మధ్య కాలంలో కెనడాలో సిక్కు పౌరుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి లీనా డయాబ్.. ఏదైనా మహమ్మారి సోకిన లేదా యుద్ద సమయాల్లో ఉపయోగించే అత్యవసర అధికారాలను కోరుతున్నట్టు సమాచారం.

