Wednesday, May 6, 2026 09:47 PM
Wednesday, May 6, 2026 09:47 PM

రోహిత్ పెళ్లిలో అంతా తానైన చంద్రబాబు.. మరి జూనియర్ ఎక్కడ?

ప్రముఖ యంగ్ హీరో నారా రోహిత్ వివాహం నిన్న శిరీషతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ఈ వేడుక పూర్తిగా రాజసంగా సాగింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరైనప్పటికీ, రోహిత్‌కు అత్యంత సన్నిహితులు అయిన శ్రీ విష్ణు, మంచు మనోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఏడాది తర్వాత అదే సమయానికి పెళ్లి జరిపి ఈ జంట కొత్త జీవితాన్ని ఆరంభించింది.

Also Read : కన్నీరు పెట్టిస్తున్న రైతన్నల వీడియోలు.. నిండా ముంచిన తుఫాన్

ఈ వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే నందమూరి బాలకృష్ణ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై దీవెనలు అందించారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాలేదు. రోహిత్ ఆయనను ఆహ్వానించలేదా? లేక ఆహ్వానించినా ఎన్టీఆర్ రాలేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గతంలో ఎన్టీఆర్ తన భార్య సోదరుడు నార్నె నితిన్ పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరై ఆ వేడుకను స్వయంగా నిర్వహించినట్టు కనిపించాడు. ఆ వేడుకకు నారా లేదా నందమూరి కుటుంబ సభ్యులు రాకపోవడం, ఇప్పుడు రోహిత్ పెళ్లికి ఎన్టీఆర్ రాకపోవడం – ఈ రెండు సంఘటనలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

Also Read : తిరుమల లడ్డు కేసులో వెలుగులోకి పాపాలు..!

ఇదంతా పక్కన పెడితే, వధువు శిరీష కూడా టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. నారా రోహిత్‌తో కలిసి ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించిన ఆమె, ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రంలో కూడా భాగమైంది. అయితే, ఆ సినిమాలో ఆమె సన్నివేశాలు ఎడిటింగ్ సమయంలో తొలగించబడినట్టు సమాచారం. శిరీష అందం, నటనకు ఇప్పటికే మంచి పేరు వచ్చింది. పెళ్లి తరువాత ఆమె సినిమాల్లో కొనసాగుతుందో లేదో తెలియదు కానీ, కొనసాగితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్