Sunday, June 21, 2026 01:57 PM
Sunday, June 21, 2026 01:57 PM

జయలలితను గుర్తు చేస్తున్న కవిత.. న్యూ పొలిటికల్ లుక్

సాధారణంగా రాజకీయ నాయకులు పరిస్థితికి తగ్గట్టు తమ వేషాలను మారుస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఓట్ల కోసం, ప్రజల్లో ఆదరణ కోసం, మీడియాలో మైలేజ్ కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇక రాజకీయాల్లో మహిళా రాజకీయ నాయకుల శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. కాస్త హుందాగా కనపడే ప్రయత్నం చేస్తూ.. క్లాసిక్ లుక్స్ కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. స్టైలిష్ లుక్స్ పక్కన పెట్టి చీరలలో కాస్త హుందాగా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజల్లో సరికొత్తగా కనపడేందుకు తీవ్రంగా కష్టపడతారు. ఇదే కోవలో చేరారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

Also Read : అయ్యో పాపం.. పరిస్థితి మరీ ఇంత దారుణమా..!

భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన తర్వాత సొంత ఇమేజ్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న కవిత.. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిరసన కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. తన కొడుకుని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. ఇక తాజాగా కవిత ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ఆమె ఇంటి వద్ద తనను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాగా.. వారికి అభివాదం చేసే విధానంలో గాని, ఆమె వస్త్రధారణలో గానీ కాస్త కొత్తదనం కనపడింది.

Also Read : స్పిరిట్ కోసం ప్రభాస్ కొత్త లుక్.. వేరే లెవెల్ ప్లాన్..!

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరహాలో.. కనిపించారు కవిత. ఇప్పటివరకు జుట్టు ఫ్రీగా వదిలేసిన ఆమె, తాజా లుక్స్ లో మాత్రం ముడివేసి కనపడటం, అలాగే పెద్ద వయసు వారి ధరించే చీరలు కట్టడం వంటివి చేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించే క్రమంలో ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా కాస్త డిఫరెంట్ గా కనపడింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ వాటిని పాజిటివ్ గా వైరల్ చేయగా.. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటుగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా తన లుక్స్ తో కవిత ట్రెండ్ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్