Thursday, May 7, 2026 04:38 AM
Thursday, May 7, 2026 04:38 AM

జక్కన్న క్రేజీ ప్లాన్.. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ ఈవెంట్

బాహుబలి తర్వాత నుంచి రాజమౌళి సినిమాలకు వరల్డ్ వైడ్ క్రేజ్ క్రియేట్ అవుతుంది. సినిమా సినిమాకు రాజమౌళి హీట్ పెంచడంలో సక్సెస్ అవుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్న రాజమౌళి.. ఇప్పటివరకు టాలీవుడ్ చూడని కొత్త జోనర్లో సినిమాను తీసుకొస్తున్నాడు. ఆఫ్రికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేయాడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సినిమా షూటింగ్ కూడా గత సినిమాలకు మాదిరిగా ఆలస్యం చేయకుండా వేగంగానే కంప్లీట్ చేస్తున్నాడు.

Also Read :వైజయంతి మూవీస్ పై బాలీవుడ్ ఫ్యాన్స్ ఏడుపులు.. ఎందుకీ ఫేక్ ప్రచారం..?

ఇక గత సినిమాలు కంటే ఈ సినిమాను మరింత భిన్నంగా ప్లాన్ చేశాడు. సాధారణంగా రాజమౌళి సినిమాలకు సంబంధించి అప్డేట్స్ పెద్దగా ఉండవు. కానీ ఈ సినిమా అప్డేట్స్ మాత్రం ఫాస్ట్ గా ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. లేటెస్ట్ గా టీజర్ ఈవెంట్ గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈనెల 15న ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 25 వేల నుంచి 30 వేల మంది వరకు ఆడియన్స్ హాజరయ్యే విధంగా ఈవెంట్ ప్లాన్ చేశాడట.

Also Read :తెలంగాణకు మోంథా సడెన్ ట్విస్ట్.. ఏపీకే తక్కువ నష్టం..?

దీనికి సంబంధించి ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో వర్క్ కూడా మొదలైనట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కొంత భాగం రామోజీ ఫిలిం సిటీ లో కూడా షూట్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన జక్కన్న.. కొన్ని పాత్రలకు సంబంధించి వర్కౌట్ చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో ఓ నెగటివ్ రోల్ కు హీరో రాజశేఖర్ ను తీసుకున్నట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. ఇక ప్రియాంక చోప్రా కూడా నెగిటివ్ రోల్ లోనే నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఎలా ఉన్నా సినిమాకు వస్తున్న హైప్ మాత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అనే సిగ్నల్స్ ఇస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్