Sunday, June 21, 2026 01:55 PM
Sunday, June 21, 2026 01:55 PM

హెచ్ 1 బీతో అమెరికన్లకు అన్యాయం.. ప్రముఖ కంపెనీ సీఈఓ సంచలనం

విదేశాల్లో స్థిరపడి వ్యాపారాలు చేసే వారు.. తమ దేశానికి చెందిన వారికి అక్రమంగా ఇమ్మిగ్రేషన్ లో ఉన్న లొసుగులను వాడుకుని వీసాలు ఇవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో ఉండే వారు హెచ్ 1 బీ వీసాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తూ ఉంటాయి. తాజాగా దీనిపై అమెరికాలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అజోరియా సీఈఓ జేమ్స్ ఫిష్‌బ్యాక్ ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేసారు. అమెరికన్లపై విమర్శలు చేసారు ఫిష్ బ్యాక్.

Also Read : బెజవాడలో అఖండ తాండవం.. క్రేజీ అప్డేట్..!

దీనిని ఒక స్కాం గా ఆయన అభివర్ణించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫిష్‌బ్యాక్.. హెచ్-1బీ కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వ్యాపారాలు చేసే అమెరికన్లు కనీసం స్వదేశం వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమెరికన్లకు అవకాశం ఇచ్చే విషయాన్ని వదిలేసి.. భారతీయులు, ఇతర దేశాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కంపెనీలు ఉద్యోగ ప్రకటనలు బహిరంగంగా చేయడం లేదని, వార్తా పత్రికలకు విషయం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయని మండిపడ్డారు.

Also Read : రంగంలోకి పవన్.. సోషల్ మీడియాలో పవన్ తుఫాన్

ఎవరూ అప్లై చేయలేదనే కారణంతో విదేశాల్లో ఉండే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నారని, అర్హత కలిగిన అమెరికన్లకు ఉద్యోగం, వేతనం, దానితో వచ్చే గౌరవం, ఉద్దేశం వదిలేసారని మండిపడ్డారు. అమెరికన్ కంపెనీలు విదేశీ కార్మికులపై ఆధారపడకుండా, దేశంలో ఉన్న టాలెంట్ పై దృష్టి పెట్టాలని కోరారు. విదేశీ కార్మికులు చవకగా దొరుకుతున్నారని, కానీ వారి కంటే ఎక్కువ అర్హతలు అమెరికన్ లకు ఉన్నా సరే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆపిల్, గూగుల్, అమెజాన్ మరియు మెటా వంటి కంపెనీలు హెచ్ 1 బీలను ఎక్కువగా వాడుకుంటున్నాయన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్