Sunday, September 20, 2026 04:09 AM
Sunday, September 20, 2026 04:09 AM

సౌదీ అరేబియాలో స్కై స్టేడియం..!

స్టేడియం అనగానే అందరికీ పెద్ద ప్లే గ్రౌండ్ గుర్తుకు వస్తుంది. పెద్ద పెద్ద గ్యాలరీలు, వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు.. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని స్టేడియాలు కూడా నేల మీదే డిజైన్ చేశారు. కానీ సౌదీ అరేబియా మాత్రం కాస్త భిన్నంగా ఆలోచన చేసింది. నేల మీద కాకుండా.. గాలిలో స్టేడియం ఉంటే.. ఎలా ఉంటుందా అని ఆలోచించింది. వెంటనే.. దానిని ఆచరణలోకి తీసుకువచ్చింది. ఏకంగా 350 మీటర్ల ఎత్తులో స్టేడియం నిర్మాణానికి సౌదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. 5 ఏళ్లల్లో ఈ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో సౌదీ సర్కార్ కార్యాచరణ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన నమూనాను ఇప్పటికే విడుదల చేసింది.

Also Read : కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

సౌదీ అరేబియా అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది లగ్జరీ భవనాలు.. వింతలు, విశేషాలు. పర్యాటకులకు స్వర్గధామం సౌదీ. ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు సౌదీని సందర్శిస్తుంటారు. ఇదే సమయంలో మెగా ఈవెంట్ నిర్వహణకు సౌదీ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించేందుకు ఇప్పటికే సౌదీ సర్కార్ ఆసక్తి చూపిస్తోంది. 2034లో జరగనున్న ఫిఫా పుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచానికి తానేమిటో చాటి చెప్పేందుకు వినూత్న ఆలోచన చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆకాశంలో స్టేడియం నిర్మించేందుకు సిద్ధమైంది.

Also Read : రంగంలోకి పవన్.. సోషల్ మీడియాలో పవన్ తుఫాన్

భూమికి 350 మీటర్ల ఎత్తులో ఓ భారీ భవనం నిర్మించనున్నారు. దాని పైన స్టేడియం నిర్మిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. దీనిని 2027లో మొదలుపెట్టి.. 2032 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. స్కై స్టేడియం నిర్మాణం కోసం రూ.7,500 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించింది. మరో విశేషం ఏమిటంటే.. ఈ స్టేడియంలో ఏకంగా 46 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2034లో జరగనున్న ఫిఫా టోర్నీలో సౌదీ అరేబియాలోని 5 నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందుకోసం భారీ స్టేడియాలను సౌదీ సర్కార్ నిర్మిస్తోంది. కింద గ్లాస్ భవనం.. పైన స్టేడియం.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2034 ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో ఈ స్టేడియం ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా మారనుంది. సౌదీలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇలాంటి కట్టడాలు మరింత ఊతమిస్తాయని సౌదీ సర్కార్ వెల్లడించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్