Saturday, September 19, 2026 08:12 PM
Saturday, September 19, 2026 08:12 PM

బెజవాడలో అఖండ తాండవం.. క్రేజీ అప్డేట్..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కు పండుగే. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. నార్మల్ ఆడియన్స్ కూడా బాలయ్య సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. మాస్ ఆడియన్స్ లో బాలయ్య సినిమాలు తీసుకొచ్చే ఊపు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బాలయ్య అఖండ సీక్వెల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Also Read : గట్టిగానే సంక్రాంతి పోటీ.. ఇవి ఫిక్స్..!

ఫాన్స్ కూడా సినిమాకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ హైప్ తీసుకొస్తున్నారు. అటు ట్రేడ్ అనలిస్టులు కూడా సినిమాకు భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నార్త్ ఇండియాలో సినిమాకు క్రేజ్ పెరిగే సంకేతాలు సైతం కనపడుతున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో సినిమా యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై క్లారిటీ రావడం లేదు. దాదాపు నెల రోజుల నుంచి ఈ ఈవెంట్ విషయంలో సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. రాయలసీమలో భారీగా ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేశారు.

Also Read : ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.. అసలు ఏమైంది..?

ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విజయవాడ సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈవెంట్ నిర్వహించేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాలేజీ యాజమాన్యంతో కూడా సినిమా యూనిట్ చర్చలు జరిపింది. సినిమాకు హైప్ తీసుకురావాలి అంటే విజయవాడలో నిర్వహిస్తే బాగుంటుందనేది చిత్ర నిర్మాతల అభిప్రాయంగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ మాత్రం బెంగళూరు, చెన్నై సహా పలు ప్రాంతాల్లో నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అఖండ ఫస్ట్ పార్ట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ విషయంలో అంతకుమించి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్