Tuesday, October 21, 2025 07:13 PM
Tuesday, October 21, 2025 07:13 PM
roots

సమంత–రాజ్‌ నిడిమోరు లవ్‌ స్టోరీ నిజమా?

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత రూత్‌ ప్రభు. ఎప్పుడు వార్తల్లో ఉండాలో బాగా తెలుసు. సినిమా షూటింగ్స్‌, ట్రావెల్స్‌, హెల్త్‌, ఫ్యాషన్‌, సోషల్‌ వర్క్‌… ఏదైనా తీసుకున్నా ఆమె చర్చలో ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆమె పేరు చుట్టూ తిరుగుతున్న వార్త.. సమంత డేటింగ్‌లో ఉందట! ఈ వార్తల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడిమోరు.

Also Read : ChaiySo : నాగ చైతన్య శోభిత @ Diwali 2025

ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో సమంత, రాజ్‌ నిడిమోరు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. ఫ్యామిలీ వాతావరణంలో, బాణసంచా కాలుస్తూ ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో కాసేపట్లోనే వైరల్‌ అయ్యాయి. అదంతా సరిపోలేదు, ఆ ఫొటోలను సమంత స్వయంగా తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకోవడంతో రూమర్స్‌ మళ్లీ ఊపందుకున్నాయి. ఆమె రాసిన క్యాప్షన్… నెటిజన్ల ఊహాశక్తికి రెక్కలిచ్చేసింది. “ఇది రాజ్‌ గురించేనా?”, “ఇద్దరూ కలిసి ఉన్నారా?”, “సమంత మళ్లీ లవ్‌లో ఉందా?” అంటూ కామెంట్లతో సోషల్‌ మీడియా దద్దరిల్లిపోయింది.

సమంత–రాజ్‌ పరిచయం కొత్తది కాదు. 2021లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’ వెబ్‌సిరీస్‌ ద్వారా వీరిద్దరూ మొదట కలిసి పనిచేశారు. ఆ సిరీస్‌లో సమంత చేసిన రోల్‌ ఆమె కెరీర్‌లో ఒక మైలురాయి అయ్యింది. తర్వాత ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌ కోసం కూడా రాజ్‌–డీకేతో మళ్లీ జట్టు కట్టింది. ఈ ప్రాజెక్టుల సమయంలో సమంత, రాజ్‌ మధ్య స్నేహం బలపడిందన్న ప్రచారం అప్పట్లోనే మొదలైంది. షూటింగ్‌ తరువాత కూడా వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని, ఫ్యామిలీ గెట్టుగెదర్స్‌లో కూడా పాల్గొంటున్నారని ఇండస్ట్రీ టాక్‌.

వైరల్‌ అవుతున్న ఫొటోలు చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. “ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు.”, “సామ్‌ మళ్లీ హ్యాపీగా కనిపిస్తోంది.”, “సమంతకు రాజ్‌ బాగానే సూట్‌ అవుతాడు.” వంటి రియాక్షన్‌లు వరసగా వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం “వీరిద్దరూ కేవలం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే కావచ్చు” అంటున్నారు. ఇంత చర్చ జరుగుతున్నా, సమంత గానీ రాజ్‌ నిడిమోరు గానీ ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇద్దరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారని, వ్యక్తిగత విషయాలపై స్పందించరని దగ్గరి వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Samantha : రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సెలెబ్రేషన్స్

సమంత ప్రస్తుతం తన హెల్త్‌పై దృష్టి పెట్టుతూ, స్క్రిప్టులు వింటోందని సమాచారం. మరోవైపు రాజ్‌–డీకే జంట ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ 2’ వంటి వెబ్‌ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. సమంత–రాజ్‌ నిడిమోరు మధ్య నిజంగానే ఏదైనా ప్రత్యేక బంధముందా? లేక ఇది కేవలం స్నేహమా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం.. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా సోషల్‌ మీడియాలో హడావుడి మాత్రం గ్యారంటీ!

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్