Wednesday, May 6, 2026 11:47 PM
Wednesday, May 6, 2026 11:47 PM

ఆస్ట్రేలియాలో గిల్ కష్టమేనా..? ఎందుకీ వైఫల్యం..?

అన్ని దేశాల్లో క్రికెట్ వేరు.. సేనా దేశాల్లో క్రికెట్ వేరు. అక్కడ ఉన్న పిచ్ లు.. ఉపఖండం ఆటగాళ్లకు ఓ సవాల్. ముఖ్యంగా బ్యాట్స్మెన్ కు చుక్కలు కనపడుతూ ఉంటాయి. బులెట్ మాదిరిగా దూసుకు వచ్చే బంతులతో.. షాట్ సెలెక్షన్ అంత ఈజీ కాదు. బంతిని అంచనా వేయడం కూడా కష్టమే. ముఖ్యంగా బంతి పాతబడే వరకు క్రీజ్ లో నిలబడటం కీలకం. ఈ టెక్నిక్ తెలిస్తే ఆస్ట్రేలియాలో ఆడటం కాస్త సులువు. కానీ భారత ప్రస్తుత కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం ఈ విషయంలో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు.

Also Read : సీమలో భారీగా ఉగ్ర నెట్వర్క్..? మరో ఇద్దరు అరెస్ట్..!

మొన్నటి టెస్ట్ సీరీస్ లో గిల్ ఎలా ఫెయిల్ అయ్యాడో ఇప్పుడు వన్డే సీరీస్ లో కూడా అదే తరహాలో ఫెయిల్ అయ్యే సంకేతాలు కనపడుతున్నాయి. పిచ్ బౌలింగ్ కు అనుకూలించినా, బంతి వేగంగా వస్తున్నా గిల్ తడబడుతున్నాడు. ఇంగ్లాండ్ లో నామ మాత్రపు బౌలర్ లపై దూకుడుగా ఆడిన ఈ పంజాబీ ప్రిన్స్.. మేటి బౌలర్ లను ఎదుర్కొనే విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో అతని యావరేజ్ కేవలం 20 లోపే ఉండటం కూడా ఆశ్చర్యపరుస్తోంది. గిల్ బ్యాటింగ్ పొజిషన్ కు ఆస్ట్రేలియా మైదానాలు ఇబ్బందిగా మారాయి.

Also Read : బ్రేకింగ్: ఛీఫ్ సెలెక్టర్ గా రవిశాస్త్రి

దానికి తోడు అతని సారధ్యంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా మైదానాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కానీ గిల్ వద్ద ప్రణాళిక లేదనే విమర్శలు వస్తున్నాయి. నాలుగు విరామాల్లో ఆట జరిగినప్పుడు.. సరైన సమయం దొరికినా సరే గిల్ వినియోగించుకోలేదు అని, బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా లోపాలు ఉన్నాయనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఓపెనింగ్ స్థానం విషయంలో గిల్ పట్టుదలగా ఉండటం చికాకు పెట్టె అంశంగా విమర్శలు వస్తున్నాయి. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మను ఓపెనింగ్ కు పంపి, గిల్ నాలుగవ స్థానంలో వస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్