Thursday, October 1, 2026 09:27 PM
Thursday, October 1, 2026 09:27 PM

ఈరోజు (10-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 10-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 10-10-2025

భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

—————————————

వృషభం 10-10-2025

నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

—————————————

మిధునం 10-10-2025

వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది.

—————————————

కర్కాటకం 10-10-2025

మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి.

—————————————

సింహం 10-10-2025

ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

—————————————

కన్య 10-10-2025

ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.

—————————————

తుల 10-10-2025

దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.

—————————————

వృశ్చికం 10-10-2025

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.

—————————————

ధనస్సు 10-10-2025

కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం ఋణాలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.

—————————————

మకరం 10-10-2025

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

కుంభం 10-10-2025

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

మీనం 10-10-2025

సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో. చేతికి అందుతుంది.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్