Wednesday, February 4, 2026 11:27 PM
Wednesday, February 4, 2026 11:27 PM

ఈరోజు (05-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 05-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 05-10-2025

చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

—————————————

వృషభం 05-10-2025

సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు.

—————————————

మిధునం 05-10-2025

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యా విషయాల అనుకూలిస్తాయి.

—————————————

కర్కాటకం 05-10-2025

చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

సింహం 05-10-2025

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘ కాళిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది.

—————————————

కన్య 05-10-2025

నూతన మిత్రుల పరిచయాలు లాభం సాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.

—————————————

తుల 05-10-2025

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

—————————————

వృశ్చికం 05-10-2025

వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

—————————————

ధనస్సు 05-10-2025

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

—————————————

మకరం 05-10-2025

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మికధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

—————————————

కుంభం 05-10-2025

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి.

—————————————

మీనం 05-10-2025

చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్