Wednesday, February 4, 2026 01:04 PM
Wednesday, February 4, 2026 01:04 PM

చంద్రబాబు ముందుకు అసెంబ్లీ అటెండెన్స్..? ఎమ్మెల్యేలపై చర్యలు..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గతంలో కంటే కాస్త భిన్నంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులందరూ హాజరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాలను వదిలి సమావేశాల్లో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. ఇక మంత్రులు కూడా అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవడం లేదు. అయితే ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిఘా పెట్టింది. ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేనివిధంగా కాస్త కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

Also Read : ఆ స్టార్ హీరో కార్ల కలెక్షన్ తెలుసా..?

అసెంబ్లీ సమావేశాలను తేలికగా తీసుకునే వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని.. విజయవాడ హోటల్స్ లో లేదంటే.. గుంటూరు హోటల్స్ లో ఉంటూ వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని గుర్తించారు. కీలకమైన చర్చలు జరుగుతున్న సమయంలో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సభలో లేరు. సాగునీటిపై మాట్లాడే సమయంలో ఎమ్మెల్యేలు సభలో లేకపోవడాన్ని సీఎం చంద్రబాబుతో పాటుగా ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నట్లు అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి.

Also Read : గర్భంతో ఉంటే బొప్పాయి తినవచ్చా..? కుంకుమ పువ్వు సెంటిమెంట్ నిజమేనా..?

అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు కూడా సభకు రావడం లేదని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే ముందుగా ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సభలో నామమాత్రంగా ఉండటం లేదా సంతకం పెట్టి వెళ్లిపోవడం వంటివి జరుగుతున్నాయి. అటు జనసేన, బిజెపి ఎమ్మెల్యేల తీరు కూడా ఇలాగే ఉంది. దీనితో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభకు రాని ఎమ్మెల్యేల జాబితా అలాగే అటెండెన్స్ రిజిస్టర్ నుంచి సమాచారాన్ని తెప్పించుకున్నట్లు.. తెలుస్తోంది. అటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్