Wednesday, May 6, 2026 11:25 PM
Wednesday, May 6, 2026 11:25 PM

అరుణ ఫోన్ లో ఐపిఎస్, మాజీ మంత్రి వీడియోలు..?

నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్యవహారంలో ఎప్పుడు ఏ పేరు బయటకు వస్తుందా అని పోలీసులు వణికిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని ఆమెతో అన్ని చేష్టలు చేసిన పోలీసులకు ఇప్పుడు ఆమె ఏ సమాచారం బయటపెడుతుందా అనే భయం వెంటాడుతోంది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది ఆమె ఉచ్చులో పడినట్టు తెలుస్తోంది. ఆమె ప్రియుడు శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించేందుకు ఏకంగా ఓ పోలీసు అధికారినే ఆమె గోవా తీసుకుని వెళ్లినట్టు వెల్లడి అయింది.

Also Read : జగన్ మరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

దానికి సంబంధించిన ఆడియో కూడా బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు ఓ ఐపిఎస్ అధికారితో ఆమె వీడియోలు కూడా ఉన్నాయనే వార్త బయటకు వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితో ఆమెకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దీనితో ఆమె ఫోన్ ను కోర్ట్ సమక్షంలో ఓపెన్ చేయించేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. కోర్టు అనుమతి తీసుకునేందుకు త్వరలో పిటీషన్ వేయనున్నారు. ఆమె వద్ద మొత్తం ఆరు ఫోన్ లు ఉండగా.. వాటితోనే ఆమె ఎక్కువగా వ్యవహారాలు నడిపినట్టు గుర్తించారు.

Also Read : అప్పుడు ప్రజాస్వామ్యం లేదా చిన్న సారూ..?

ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆమె మాట్లాడినప్పుడు వాటిని రికార్డ్ చేయడం, వారు తనతో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం వంటి చర్యలకు ఆమె దిగింది. ఇలాగే నెల్లూరుకు చెందిన ఓ అధికారి దొరికిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.. ఆమె ఇంట్లో కొన్ని పెన్ డ్రైవ్ లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ల్యాప్ టాప్ ను కూడా స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. లభ్యమైన ఆధారాలతో అధికారులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్