Saturday, September 19, 2026 02:27 PM
Saturday, September 19, 2026 02:27 PM

నేను రెడీగా ఉన్నా.. మోడీ సంచలన కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా నుంచి ఆయిల్ నిల్వలు భారత్ కొనడంపై తన అక్కసు ప్రదర్శిస్తోన్న ట్రంప్ సర్కార్.. రెండు విడతల్లో 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో భారత ఉత్పత్తులపై అమెరికాలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్, స్మార్ట్ ఫోన్ ఉత్పత్తులపై దీని ప్రభావం పడకపోయినా.. ఇతర ఉత్పత్తులపై పడే అవకాశం స్పష్టంగా ఉంది. రాజకీయంగా కూడా దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.

Also Read : ఉప రాష్ట్రపతి ఆయనే..? తమిళ బ్రాహ్మిణ్ కు కీలక పదవి..!

దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, భారత్ తన రైతుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్పష్టం చేసారు. ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, “మాకు, మా రైతుల ప్రయోజనాలే ప్రధాన ప్రాధాన్యత. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎప్పుడూ రాజీపడదని తేల్చి చెప్పారు.

Also Read : మళ్లీ అధికారం.. సాధ్యమేనా..?

ఈ విషయంలో మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు, దానికి నేను సిద్దంగా ఉన్నాను. భారత్ కూడా అందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. భారత్.. రష్యా నుంచి కొనుగోళ్ళు ఆపే వరకు తాను తగ్గేది లేదని ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. అటు చైనా విషయంలో కూడా ట్రంప్ ఇదే వైఖరి ప్రదర్శించే అవకాశం కనపడుతోంది. చైనా, భారత్ పెద్ద ఎత్తున రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధులతో ఉక్రెయిన్ పై యుద్దానికి రష్యా వాడుతుందని ట్రంప్ మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్