Sunday, June 21, 2026 01:56 PM
Sunday, June 21, 2026 01:56 PM

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అబ్బాయిలకు ఇంత ఉపయోగమా..?

ఈ రోజుల్లో బరువు తగ్గడానికి ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో పురుషులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం చూస్తూనే ఉన్నాం. అసలు అబ్బాయిలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం. 16:8 పద్ధతి ఫాలో అవుతూ బరువు తగ్గుతూ ఉంటారు. 16 గంటల ఉపవాసం, 8 గంటల తినే సమయం అన్నమాట.

Also Read : పాన్ పరాగ్ దెబ్బకు షేక్ అవుతోన్న యూకే.. ఇదేం రోత..?

ఇలా చేయడం కారణంగా అడపాదడపా ఉపవాసం ఉండటం వల్ల పురుషులలో హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రేరేపించే లూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచవచ్చు. ఉపవాస సమయాన్ని పొడిగించడం ద్వారా, శరీరం ఇంధనం కోసం కొవ్వు నిల్వలను ఉపయోగించుకుంటుంది. కొవ్వు కరుగుతూ ఉంటుంది. దీనితో కండరాలపై ఉపవాసం ప్రభావం పడదు. ఉపవాస సమయాలు ఇన్సులిన్ లెవెల్స్ ను గణనీయంగా తగ్గిస్తాయయట. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read : భారత్ మోసం చేస్తుంది.. అమెరికా అధికారి సంచలన కామెంట్స్

అడపాదడపా ఉపవాసం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగుపడుతూ ఉంటాయి. దీనితో గుండెపోటు సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు, శరీరం మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోటీన్ అయిన బ్రెయిన్-డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. పురుషులు అందంగా ఉండటానికి కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బులు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. రోజంతా ఎనర్జీ కంటిన్యూ అవుతూ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్