Tuesday, October 21, 2025 07:50 PM
Tuesday, October 21, 2025 07:50 PM
roots

అమెరికా, రష్యాలను వణికించిన భూకంపం.. రష్యాలో సునామీ భీభత్సం..!

ఇటీవల అమెరికాను వణికించిన భూకంపం ఇప్పుడు రష్యాకు చుక్కలు చూపించింది. రష్యాలో మారుమూల ఉండే కమ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. దీని ఫలితంగా రష్యాలో సునామీ భీభత్సం సృష్టించిందని, తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని రష్యా అధికారులు తెలిపారు. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 8:25 గంటలకు సంభవించిన భూకంపం ప్రాథమికంగా 8.0 తీవ్రతతో నమోదైందని జపాన్, అమెరికా భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Also Read : భారత్ కు ట్రంప్ దెబ్బ.. టారిఫ్ లతో కొత్త షాక్..?

దీనితో జపాన్, అమెరికాతో సహా అనేక దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ చేసారు. అమెరికాలో అలాస్కా, హవాయిలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఒకటి నుండి మూడు మీటర్ల వరకు అలలు తీర ప్రాంతాలను తాకవచ్చని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవాయి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.

Also Read : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఏటీఎం కార్డుల సైజులో కొత్త రేషన్ కార్డులు

ముందు అలల కంటే తర్వాత వచ్చే అలల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, గంటల తరబడి ఆ తీవ్రత కొనసాగవచ్చని అక్కడి వాతావరణ శాఖ స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంతగా తీర ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిదని సూచించింది. మార్చి 2011లో ఈశాన్య జపాన్‌లో సంభవించిన 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ప్రపంచంలోనే అత్యంత బలమైన భూకంపం ఇదేనని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గత నెల రోజుల్లో రష్యాలో ఇదే ప్రాంతంలో 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్